Site icon HashtagU Telugu

Hanuman: పంచముఖ ఆంజనేయ స్వామిని ఈ విధంగా పూజిస్తే చాలు.. కష్టాల గురించి బయటపడటం ఖాయం!

Hanuman

Hanuman

హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్ళలో ఆంజనేయ స్వామి కూడా ఒకరు. ఆంజనేయ స్వామిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ప్రతి గ్రామంలో తప్పనిసరిగా ఆంజనేయస్వామి ఆలయం ఉంటుంది. అయితే కొంతమంది ఆంజనేయస్వామి మంగళవారం పూజిస్తే మరి కొంతమంది శనివారం రోజు పూజిస్తూ ఉంటారు. కానీ హిందూ శాస్త్రం ప్రకారం చూసుకుంటే మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి అంకితం చేయబడింది. ఈ వారాల్లో ఆంజనేయస్వామిని ప్రత్యేకంగా పూజించడం వల్ల ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని పండితులు సైతం చెబుతున్నారు.

ఇకపోతే మామూలుగా ఒక్కొక్క ప్రదేశంలో ఆంజనేయస్వామి ఒక్కొక్క అవతారంలో మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. మామూలు ఆంజనేయ స్వామి ఆలయాలు చాలానే ఉంటాయి.. కానీ ఈ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయని చెప్పాలి. కొన్ని కొన్ని ప్రదేశాలలో మాత్రమే ఏమనుకో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. కాగా పంచముఖి ఆంజనేయుడు చైత్రమాసం పౌర్ణమి నాడు జన్మించాడు. ఒక్కో ముఖం ఒక్కోలా ఉంటుంది. ఐదు ముఖాలలో మొదటి ముఖం కోతి, రెండవ ముఖం డేగ, మూడవ ముఖం వరాహ, నాల్గవ ముఖం నరసింహ, ఐదవ ముఖం గుర్రం.

ఆంజనేయుడి మొదటి వానర రూపం మనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్న శత్రువులను జయించడంలో సహాయపడుతుందట. అదేవిధంగా మీరు చిన్న చిన్న విషయాలకే పెద్దగా కష్టపడుతున్నట్లయితే గరుడు రెండవ ముఖం మనకు ఎంతో మేలు చేస్తుందట. జీవితంలో కీర్తి, బలం, ధైర్యం, ఆయు ఆరోగ్యాలు పొందాలంటే మూడవ ముఖమైన వరాహుడిని పూజించాలని చెబుతున్నారు. భయం, నిరాశ, ఒత్తిడి , ప్రతికూల శక్తుల నుండి దూరంగా ఉండాలంటే నరసింహ రూపాన్ని పూజించాలట. అదేవిధంగా మన జీవితంలోని కోరికలన్నీ తీరాలంటే అశ్వ ముఖాన్ని పూజించాలని పండితులు చెబుతున్నారు. కాబట్టి పంచముఖ ఆంజనేయస్వామి పూజించడం వల్ల పైన చెప్పిన ఐదు రకాల సమస్యల నుంచి బయటపడడం ఖాయం అని చెబుతున్నారు. ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన వడమాల అలాగే సింధూరం వంటివి సమర్పించి పూజలు చేయడం వల్ల ప్రత్యేక అనుగ్రహం కలుగుతుందట. అంతేకాకుండా ఆంజనేయస్వామిని ఎక్కువగా ఆరాధించే వారికి శని దేవునికి సంబంధించిన సమస్యలు ఇబ్బందులు కూడా కలగవట.