Site icon HashtagU Telugu

Vastu and fish: ఇంట్లో అక్వేరియం ఉండవచ్చా.. ఏ దిశలో ఉండాలి? ఎన్ని చేపలు ఉండాలో తెలుసా?

Fish Aquarium

Fish Aquarium

చాలామందికి చేపలు అంటే చాలా ఇష్టం. కొందరు చేపలను చూస్తే వారి వయసును మరిచిపోయి చిన్నపిల్లలాగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకే కొంతమంది చేపలను ఇష్టంగా అక్వేరియంలో పెంచుకుంటూ ఉంటారు. వాటి కోసం రకరకాల డిజైన్లు చేసినా అక్వేరియం లను తెచ్చి ఇంట్లో పెట్టుకుని వాటిని చూసి మురిసిపోతూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్ర ప్రకారం గా ఇంట్లో అక్వేరియం ఉండవచ్చా లేదా? ఒకవేళ ఉంటే ఏ దిశగా ఉండాలి? అక్వేరియంలో ఎన్ని చేపలు ఉండాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చాలామందికీ ఈ విషయంలో కొన్ని రకాల అపోహలు ఉంటాయి. కొందరు అక్వేరియం ఇంట్లో పెట్టుకోవడం మంచిదని భావిస్తే మరి కొందరు పెట్టుకోకూడదు అని భావిస్తూ ఉంటారు. మరి ఇంట్లో అక్వేరియం ఉండవచ్చా లేదా అన్న విషయానికి వస్తే.. అక్వేరియం ఇంట్లో ఉండడం ఒకరకంగా అదృష్టం ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్ అంటున్నారు మన వాస్తు శాస్త్ర నిపుణులు. ఎందుకంటే చేపలు నెగిటివ్ తరంగాలను తమలో ఇముడ్చుకొని చక్కటి అనుకూలమైన తరంగాలను బయటకు విడుదల చేస్తుంటాయి. అలాగే అక్వేరియం ఉండడం వల్ల ప్రతికూల ఆలోచనలు నెగిటివ్ ఎనర్జీని తరిమి కొడుతుంది. ఆర్థిక ఇబ్బందులు సంతాన సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

ఇక ఎన్ని చేపలు ఉండాలి అన్న విషయానికి వస్తే.. మొత్తం తొమ్మిది చేపలు ఉండేలా చూసుకోవాలి. వాటిలో ఎనిమిది డ్రాగన్ చేపలు కానీ ఎనిమిది గోల్డ్ కలర్ చేపలు కానీ ఉండాలి. ఆ మిగిలిన 8 వాటిలో కచ్చితంగా ఒకటి నల్ల చేప ఉండాలి. ఒకవేళ ఏదైనా చాప చనిపోతే దాని ఇంటి బయట మట్టిలో పాతేసి అలాంటి చేపని తెచ్చి అక్వేరియంలో చేర్చండి. 9 కంటే ఎక్కువ ఉండకపోవడం మంచిది. ఎక్వేరియం ఇంట్లో ఏ దిశగా ఉండాలి అంటే వాస్తు ప్రకారంగా తూర్పు దిశగా కానీ లేదంటే ఉత్తర దిశగా కానీ ఉండాలి. అలాగే ఇంట్లో ప్లేస్ ఉంది కదా అని ఎక్కడపడితే అక్కడ పెట్టేస్తే ఇంట్లో గొడవలు ఎక్కువగా జరుగుతాయి.