First Lunar Eclipse: మే 16న తొలిచంద్రగ్రహణం…తీసుకోవల్సిన జాగ్రత్తలేంటి..!!

హిందూసనాతన ధర్మంలో సూర్యగ్రహణానికి...చంద్రగ్రహణానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం మే నెలలో రానుంది. సూర్యగ్రహణం వచ్చిన సరిగ్గా 15రోజుల తర్వాత చంద్రగ్రహణం ఏర్పడనుంది.

  • Written By:
  • Publish Date - May 6, 2022 / 09:50 AM IST

హిందూసనాతన ధర్మంలో సూర్యగ్రహణానికి…చంద్రగ్రహణానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం మే నెలలో రానుంది. సూర్యగ్రహణం వచ్చిన సరిగ్గా 15రోజుల తర్వాత చంద్రగ్రహణం ఏర్పడనుంది. అంటే ఈనెల 16న మొదటి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం…ఈ ఏడాది రెండు చంద్రగ్రహణలు మాత్రమే సంభవించనున్నాయి. మొదటి చంద్రగ్రహణం వైశాఖ పూర్ణిమ రోజున ఏర్పాడనుంది. ఈ ఏడాది సంభవించనున్న చంద్రగ్రహణాలు రెండూ సంపూర్ణమైనవే. ఈ గ్రహణం ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో కనిపించనుంది. అయితే చంద్ర గ్రహణాల ప్రభావం భారతదేశంలో తక్కువగా ఉండనుంది. అయితే ప్రపంచంలో ఏయే ప్రాంతాల్లో దీని ప్రభావం ఉంటుందో తెలసుకుందాం.

చంద్రగ్రహణం:
చంద్రునికి భూమికి మధ్య సూర్యుడు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందన్న సంగతి తెలిసిందే. సూర్యుడు, చంద్రుడు, భూమి సరళ రేఖలోకి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడటంతోసంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో చంద్రుడు పూర్తిగా ఎర్రగా మారుస్తాడు. చంద్రుడు, సూర్యుని మధ్యలోకి భూమి వచ్చినప్పుడు చంద్రుడిపైనా కొద్దిగా నీడ పడుతుంది. అప్పుడే పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

ఎప్పుడు ఏర్పడుతుంది:
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం..2022లో మొదటి చంద్రగ్రహణం మే 16న ఏర్పాడనుంది. రెండవది 2022 నవంబర్ 8న ఏర్పడనుంది. మొదటి చంద్రగ్రహణం 16మే 2022న ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:20 గంటలకు ముగుస్తుంది. భారత్ లో చంద్రగ్రహణం ప్రభావం పాక్షికంగానే ఉంటుంది. అలాంటి పరిస్థితిలో వైశాఖం మే 16న పూర్ణిమ జరుపుకుంటారు.

ఎక్కడ కనిపించనుంది:
మే 16, 2022న సంభవించే తొలి చంద్రగ్రహణం నైరుతి యూరప్, నైరుతి ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాలతోపాటు దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ , అంటార్కిట్ దేశాల్లో చంద్రగ్రహణం పూర్తిగా కనిపిస్తుంది. అయితే మనదేశంలోచంద్రగ్రహణ ప్రభావం లేదు.

సూతక కాలం ప్రారంభం:
చంద్రగ్రహణం యొక్క సూతక కాలం గ్రహణానికి 9గంటల ముందు ప్రారంభం అవుతుంది. అయితే చంద్రగ్రహణం కనిపించే ప్రదేశంలో మాత్రమే సూతక కాలం చెల్లుతుంది. చంద్రగ్రహణం కనిపించే దేశంలో చంద్రగ్రహణం చెల్లదు. సూతక కాలం మే 15వ తేదీ రాత్రి 10గంటల నుంచి ప్రారంభం కాగా…చంద్రగ్రహణం ముగియడంతో ముగుస్తుంది.

ఎలాంటి పనులు చేయాలి…ఏవి చేయకూడదు:
చంద్రగ్రహాన్ని నేరుగా చూడవద్దు. ఈ అద్భుతాన్ని చూసేందుకు టెలిస్కోప్ బైనాక్యులర్ లేదా కళ్లజోడులు ఉపయోగించాలి. గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు. తులసి ఆకులను ఆహార పదార్థాల్లో…ముఖ్యంగా పాలతో చేసిన వాటి ఉంచాలని. గ్రహణ కాలంలో గురుత్వాకర్షణ శక్తి కారణంగా గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని చూడవద్దు. అంతేకాదు గ్రహణం సమయంలో జుట్టు, గోర్లు కత్తిరించకూడదు. చంద్రగ్రహణం తర్వాత అన్నధానం, వస్త్రధానం చేయడం మంచిది.