TTD : తిరుమల లడ్డూ కౌంటర్ లో అగ్నిప్రమాదం

దీంతో అక్కడ క్యూలైన్‌లో నిలుచున్న భక్తులు భయంతో కేకలు పెడుతూ పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. కంప్యూటర్ యూపీఎస్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Fire breaks in Tirumala Laddu counter

Fire breaks in Tirumala Laddu counter

TTD : తిరుమలలో ఇటీవల తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతిచెందని విషయం తెలిసిందే. అయితే ఆ ఘటన మరవకముందే తిరుమల 47వ లడ్డూ కౌంటర్ వద్ద మరో ప్రమాదం చోటుచేసుకుంది. లడ్డూ కౌంటర్లో ఒక్కసారి అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో అక్కడ క్యూలైన్‌లో నిలుచున్న భక్తులు భయంతో కేకలు పెడుతూ పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. కంప్యూటర్ యూపీఎస్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగనట్టు సమాచారం. అధికారులు వెంటనే మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు.

టీటీడీ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదం జరగకుండా నివారించగలిగారు. భక్తులు ధైర్యంగా ఉండాలని, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు భరోసా ఇచ్చారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే తిరుమలలో, ఇలాంటి ఘటనలు భక్తుల భద్రతపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. కాగా, తరుచుగా తిరుమలలో జరుగుతన్న ప్రమాదాలపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ సిబ్బంది భక్తులకు సరైన వసతులన్నీ ఏర్పాటు చేయాలని.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

కాగా, వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల కోసం వచ్చిన భక్తులు తొక్కిసలాటలో మృతిచెందడం.. టికెట్ల కోసం తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. సోమవారం తిరుమలలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. తొక్కిసలాటలో గాయపడిన 31 మందికి పరిహారం చెక్కులు అందజేశమాన్నారు. ఇంకో 28 మందికి మంగళవారం లోగా చెక్కులు అందజేస్తామన్నారు. తనను ఉద్దేశించి కొందరు సోషల్‌ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తున్నారని.. వాటిని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.

Read Also: Trump vs Vance : ట్రంప్‌కు షాకిచ్చిన తెలుగింటి అల్లుడు.. వైస్ ప్రెసిడెంట్ కాకముందే..

 

 

  Last Updated: 13 Jan 2025, 05:14 PM IST