Lakshmi Devi: ఆ సమయంలో డబ్బు దొరికిందా.. దాని అర్థం ఏంటో తెలుసా?

ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో ఆరుగురు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. ఎంత సంపాదించినా కూడా డబ్బు

Published By: HashtagU Telugu Desk
Lakshmi Devi

Lakshmi Devi

ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో ఆరుగురు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. ఎంత సంపాదించినా కూడా డబ్బు చేతిలో మిగలడం లేదని దిగులు చెందుతూ ఉంటారు. అయితే ఆర్థిక పరిస్థితుల నుంచి గట్టేక్కాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉండాల్సిందే. అయితే మనం చేసే కొన్ని రకాల పొరపాట్లు ఆర్థిక సమస్యలకు కూడా కారణం అవ్వచ్చు. అయితే సాధారణంగా కొన్ని రకాల సూచనలు లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించింది అని చెప్పడానికి అలాగే త్వరలో లక్ష్మీదేవి మన ఇంటికి రాబోతోంది, అదృష్టం పట్టబోతోంది అనడానికి సంకేతాలుగా చెప్పవచ్చు. సాధారణంగా మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఇతరుల పర్సులు, పర్సులో డబ్బులు అలాగే మామూలుగా డబ్బులు దొరుకుతూ ఉంటాయి.

మరి అలా దొరకడం దేనికి సంకేతమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొన్ని కొన్ని సార్లు మన చేతిలో నుంచి డబ్బు జారిపోయి ఎక్కడ పడిపోతూ ఉంటుంది. పెద్ద మొత్తంలో డబ్బులు పోయినప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు. అయితే కష్టపడి సంపాదించిన డబ్బు అయినప్పటికీ ఉదయాన్నే మీ డబ్బులు పోగొట్టుకుంటే ఆ విషయంలో మీరు బాధపడాల్సిన అవసరం లేదు అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉదయం పూట మన దగ్గర ఉన్న డబ్బు ఎక్కడైనా పడిపోయి పోగొట్టుకుంటే అది శుభప్రదంగా భావించాలి. ఉదయాన్నే డబ్బు పోవడం అన్నది భవిష్యత్తులో మీరు పెద్ద లాభాలు పొందబోతున్నారు అనడానికి సంకేతంగా భావించవచ్చు. అలాగే మీ జోబులో లేదా పర్స్ లో నుంచి ఒక నాణెం ఉదయాన్నే నేలపై పడితే అది శుభసంకేతంగా భావించాలి. అది భవిష్యత్తులో మంచి ఫలితాలను సూచిస్తుంది అనడానికి సంకేతం. అలాగే డబ్బు కూడా రాబోతోందని అర్థం. కానీ కొంతమంది కావాలని నాణేలను కిందికి పడేస్తూ ఉంటారు.

అలా చేయడం లక్ష్మీదేవిని అవమానించినట్టు అవుతుంది. అప్పుడు మీరు డబ్బును కోల్పోతారు. అలాగే మీరు ఎదుటి వ్యక్తికి డబ్బులు ఇస్తున్నప్పుడు ఆ సమయంలో డబ్బు చేతిలోనుంచి కింద పడిపోతే అది మీకు ఎదుటి వ్యక్తికి శుభ పరిణామంగా భావించాలి. దాని అర్థం ఆగిపోయిన డబ్బు రావాల్సిన డబ్బు త్వరలో చేతికి అందుతుందని అర్థం. మీరు ఎప్పుడైనా ఉదయం బయటకు వెళ్ళినప్పుడు డబ్బు కనిపిస్తే అది శుభ సంకేతంగా భావించాలి. అలా డబ్బు దొరకడం త్వరలోనే మీరు పురోగతిని సాధించబోతున్నారు అనడానికి అర్థం. అటువంటి డబ్బును ఖర్చు చేయకుండా అదృష్టంగా భావించి పర్సులో ఉంచుకోవడం మంచిది. అలాగే ఎప్పుడైనా ఉదయం సమయంలో డబ్బుతో కూడిన పర్స్ దొరికితే లక్ష్మీదేవి దయ చూపుతుందని అర్థం. అంతేకాకుండా ఎటువంటి పని చేసినా విజయం లాభం పొందుతారని అర్థం.

  Last Updated: 03 Jan 2023, 08:14 PM IST