Site icon HashtagU Telugu

Thursday: అప్పుల ఊబిలో కూరుకుపోయారా.. అయితే గురువారం రోజు ఈ పరిహారాలు పాటించాల్సిందే!

Thursday

Thursday

ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో 8 మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం చాలామంది ఏవేవో చేస్తూ ఉంటారు. గుళ్లో గోపురాలు తిరగడం పూజలు చేయడం దానధర్మాలు వంటివి చేస్తూ ఉంటారు. అయినా కూడా ఆర్థిక సమస్యలు తీరవు. అయితే అలాంటప్పుడు కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే చాలు అంటున్నారు పండితులు. ముఖ్యంగా గురువారం రోజు కొన్ని పరిహారాలు పాటించాలట. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..

గురువారానికి అధిపతి బృహస్పతి. అదే విధంగా గురువారాన్ని లక్ష్మీవారమని కూడా అంటారు. గురువారం విష్ణువు, బృహస్పతి ఇద్దరినీ పూజిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయని చెబుతున్నారు. అంతేకాదు గురువారం శ్రీ మహా విష్ణువును పూజిస్తే నారాయణుని వక్షస్థలంలో స్థిర నివాసమున్న శ్రీలక్ష్మీ దేవిని కూడా పూజించినట్లే అని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా గురువారం రోజు శ్రీమహావిష్ణువును 108 తులసీదళాలతో పూజించడం వల్ల గురు గ్రహ దోషం నుంచి బయటపడవచ్చట. గురువారం రోజున 108 సార్లు “ఓం నమో భగవతే వాసుదేవాయ నమః” అనే మంత్రాన్ని చూపించడం వల్ల శ్రీమన్నారాయణ అనుగ్రహంతో పాటు వృత్తిలో స్థిరత్వం లభిస్తుందట. ముడి శెనగలు నీటిలో నానబెట్టి ఆ శెనగలు లక్ష్మీనారాయణులకు నైవేద్యంగా సమర్పించి అనంతరం వాటిని గోమాతకు తినిపించాలని పండితులు చెబుతున్నారు.

అలాగే నలుగురికి ప్రసాదంగా కూడా పంచి పెట్టాలట. ఇలా చేయడం వలన వివాహ సమస్యలు, దోషాలు తొలగిపోయి విష్ణుమూర్తి అనుగ్రహంతో శీఘ్రంగా వివాహం జరుగుతుందని చెబుతున్నారు. గురువారం విష్ణువు ఆలయానికి వెళ్లి పసుపు రంగు పువ్వులు, పసుపు రంగు ప్రసాదాలు నిమ్మకాయ పులిహోర, లడ్డు వంటివి సమర్పించడం వలన ఆర్థిక సమస్యలు దూరమవుతాయట. అలాగే గురువారం రోజున రావి చెట్టు, అరటి చెట్టు, తులసిని పూజించడం వల్ల విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహంతో చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. పైన చెప్పిన పరిహారాలను గురువారం రోజు పాటించడం వల్ల లక్ష్మీ అలాగే శ్రీమహావిష్ణువు కలుగుతుందని చెబుతున్నారు.