Site icon HashtagU Telugu

Goddess Lakshmi: ఇలా చేస్తే ఆర్ధిక ఇబ్బందులు అస్సలు ఉండవట.. ఏం చెయ్యాలంటే?

Lakshmi Devi

Lakshmi Devi

జీవితం అనే ఈ పరీక్షలో నెగ్గడం అన్నది చాలా కష్టంతో కూడుకున్న పని అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ జీవితమనే పరీక్షలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, సుఖాలు, దుఃఖాలు అన్నింటినీ భరించి తట్టుకొని నిలబడగలగాలి. మనిషి జీవితంలో ప్రతి ఒక్కరికి బాధలు కష్టాలు అన్నది సహజం. మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమయంలో కష్టాలు పడాల్సిందే. మానవులు వివిధ రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అలాగే వారికి వివిధ రకాల సమస్యలు కూడా మనశ్శాంతిని లేకుండా చేస్తూ ఉంటాయి.

అయితే కొంతమంది ఇలాంటి వాటిని తట్టుకొని గట్టిగా నిలబడుతుంటే మరికొందరు మాత్రం ఆ బాధలను కష్టాలను భరించలేక ఓడిపోయాము అని ఫీల్ అవుతూ ఉంటారు. జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని ఎలాగో అలా తట్టుకోవచ్చు కానీ ఆర్థిక పరమైన ఇబ్బందిని మాత్రం చాలా కష్టం. ఈ ఆర్థిక ఇబ్బందులు మనుషుల్లో ఒక్కసారిగా అందనంత స్థాయిలో నిలబెడుతుంటాయి. మరి కొంతమందిని అమాంతం పాతాళంలోకి పడేస్తూ ఉంటాయి. కాగా ప్రస్తుతం మన చుట్టూ ఉన్న సమాజంలో మనశ్శాంతి లేకుండా చేస్తున్న ఏకైక అంశం ఆర్థికపరమైన సమస్యను. ఈ ఆర్థిక సమస్యతో చాలామంది సతమతమవుతూ ఉంటారు.

మరి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడాలి అంటే తప్పకుండా మనపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. మరి ఆ లక్ష్మీ అనుగ్రహం కోసం మనం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి ప్రవేశ ద్వారం పై భాగంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ఉంచడం చాలా మేలు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కారణంగా ప్రతికూలతలు తొలగిపోతాయి. అదేవిధంగా ప్రతి శుక్రవారం గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం వల్ల అమ్మవారిని ప్రతి శుక్రవారం గులాబీలతో పూజించడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి.