ఫెంగ్‌షుయ్ వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు మన ఇంట్లో తప్పకుండా ఉండాలట. వీటివల్ల ఇంట్లో నెగెటివిటీ తొలగిపోతుందని చెబుతున్నారు. అలాగే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారని చెబుతున్నారు. మరి ఫెంగ్‌షుయ్ వాస్తు ప్రకారం మన ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది లక్కీ బ్యాంబో ప్లాంట్ ను ఇందులో పెట్టుకుంటూ ఉంటారు. కేవలం ఇళ్లల్లో మాత్రమే కాకుండా ఆఫీసులలో కూడా వీటిని అలంకరణ కోసం పెట్టుకుంటారు. అయితే వాస్తు ప్రకారం ఈ లక్కీ బ్యాంబో ప్లాంట్ ఇంట్లో ఉండడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా రావట.
అయితే ఈ మొక్కను తూర్పు లేదా ఈశాన్య దిశలో ఏర్పాటు చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. విండ్ చైమ్ మన ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వల్ల వీటి నుంచి వచ్చే శబ్దాలు ఆహ్లాదకరంగా ఉంటాయట. ఇవి మన ఇంటి వాతావరణంలో నెగటివ్ ఎనర్జీకి చోటు ఉండకుండా చేస్తాయని చెబుతున్నారు. అలాగే ఇంట్లో తాబేలును ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకోవడం వల్ల మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుందట. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారని చెబుతున్నారు. అలాగే ఇంట్లో లాఫింగ్ బుద్ధును ఏర్పాటు చేసుకోవడం వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయట. లాఫింగ్ బుద్ధ ను ఇంట్లోనే లివింగ్ రూమ్ లో ఏర్పాటు చేసుకోవడం మంచిదని చెబుతున్నారు.
వాస్తు ప్రకారం డ్రాగన్ టార్టిల్‌ను ఉత్తరదిశలో ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ ఇంట్లో ఉన్నవారు త్వరగా ధనవంతులు అవుతారట. ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకున్న ఈ డ్రాగన్ టార్టెల్ ఇంటికి ధనాకర్షణను తీసుకువస్తుందట..ఆ ఇంట్లో ఉన్న వారికి అదృష్టం వరిస్తుందని చెబుతున్నారు. అలాగే ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం ఇంట్లో పిరమిడ్ పెట్టుకోవాలట. ఇది ఇంటి మధ్య భాగంలో ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో సుఖశాంతులు వెళ్లి విరుస్తాయని పండితులు చెబుతున్నారు.