Site icon HashtagU Telugu

Spirtual: స్త్రీలు గుండు చేయించుకోవచ్చా.. పండితులు ఏం చెబుతున్నారంటే!

Mixcollage 22 Nov 2024 11 05 Am 5126

Mixcollage 22 Nov 2024 11 05 Am 5126

మామూలుగా మనం ఆలయాలకు వెళ్లినప్పుడు అక్కడ తలనీలాలను సమర్పించడం అన్నది ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. ముఖ్యంగా పెద్ద పెద్ద దేవాలయాలలో అనగా తిరుపతి, శ్రీశైలం, విజయవాడ ఇలా పెద్ద పెద్ద ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ భక్తులు దేవుళ్లకు తలనీలాలను సమర్పిస్తూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరూ తల నీలాలను సమర్పిస్తూ ఉంటారు.

కొన్ని కొన్నిచోట్ల ఆడవారు కూడా తలనీలాలను సమర్పిస్తూ ఉంటారు. మరి నిజానికి స్త్రీలు గుండు చేయించుకోవచ్చా? ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. స్త్రీలు గుండు గీయించుకోవచ్చా అని అంటే ఇలా గుండు గీయించుకునే సంప్రదాయం కేవలం మగవారికి మాత్రమే ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ముత్తయిదువుగా ఉన్న స్త్రీలు గుండు గీయించుకోవడం మంచిది కాదంట.

అంతే కాకుండా ముత్తయిదువుగా ఉన్న స్త్రీ గుండు చేయించుకునే సాంప్రదాయం లేదు అని కూడా చెబుతున్నారు. అలాగే స్త్రీలు మొక్కుబడు లు మొక్కుకున్నప్పుడు తలనీలాలు మూడు లేదా ఐదు కత్తెరలు మాత్రమే ఇస్తానని మొక్కుకోవాలని చెబుతున్నారు పండితులు. అలా మొక్కుకున్న తర్వాత దేవాలయాల దగ్గరికి వెళ్లినప్పుడు అక్కడ మూడు లేదా ఐదు కత్తెర్లను ఇవ్వడం మంచిది. స్త్రీలు లక్ష్మీదేవి లాగా నిండుగా ఉంటేనే ఆ ఇంట్లో సిరిసంపదలు చేకూరతాయని పండితులు చెబుతున్నారు. కాబట్టి స్త్రీలు దేవాలయాలకు వెళ్ళినప్పుడు గుండు చేయించుకోవడానికి బదులుగా కత్తెరలు ఇవ్వడం మంచిదని పండితులు చెబుతున్నారు.