హిందువులు ఆవును గోమాతగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. ఆవులో సకల దేవతలు కొలువై ఉంటారని నమ్మకం. హిందూ మతంలో ఆవుని గోమాతగా పూజిస్తారు. ఆవుకు ఆహరం అందించడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు దాని వెనుక లోతైన మత, ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు పండితులు. అయితే గోమాతకు ఆహారం తినిపిస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఆవుకి ఆహరం అందిస్తే సకల దేవతలకు ఆహారం అందించినట్లే అని చెబుతున్నారు. ముక్కోటి దేవతల ఆశీర్వాదాలను ఒకేసారి పొందవచ్చట. ఆవుకు ఆహారం ఇచ్చే వ్యక్తికి దేవుడికి ఆశీర్వాదం లభిస్తుందని శాస్త్రాలలో స్పష్టంగా ప్రస్తావించబడిందట. ఆవుకు బెల్లం అందించడం అంటే యాగం చేసి దానధర్మాలు చేసినంత పుణ్యప్రదంగా పరిగణించబడుతుందట. శనీశ్వరుడు, పితృ దోషాలతో బాధపడుతున్న వారు ఆవుకు, మేత లేదా బెల్లం, ఆహారం క్రమం తప్పకుండా తినిపించాలని చెబుతున్నారు. ఇలా చేయడం వలన జాతకంలో దోషాలను తగ్గించడమే కాదు జీవితంలో అదృష్టం, ఆనందం, శ్రేయస్సును పెంచుతుందని చెబుతున్నారు.
ఆవులు అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన బాల్యం అంతా కూడా ఆవులతోనే గడిచిపోయింది. అందుకే శ్రీకృష్ణున్ని గోవిందుడు గోపాలుడు వంటి పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. ఆవుకు సేవ చేసే వ్యక్తి లేదా ఆవుకి ఆహారం అందించే వ్యక్తి శ్రీకృష్ణుడి ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం. గోమాతకు ఆహారాన్ని అందించడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి ఆమె అనుగ్రహం లభిస్తుందట. ఇంట్లో మొదటి ఆహారాన్ని పెట్టడం అన్నది శుభసంకేతంగా భావించబడుతుందని చెబుతున్నారు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుందట. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయట. ఈ నియమాన్ని క్రమం తప్పకుండా పాటిస్తే జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదట. ప్రతిరోజూ ఆవుకు ఆహారం అందించిన తర్వాత మాత్రమే ఆహారం తినే వ్యక్తి ఇంట్లో ఆహారం, డబ్బు కొరత ఎప్పుడూ ఉండదని చెబుతున్నారు. అలాగే ఆవుకు రొట్టె తినిపించడం వల్ల వ్యక్తి మనస్సులో సేవాభావం, కరుణ పెరుగుతాయట. అలాగే ఆవుని పూజించినప్పుడు కానీ లేదంటే ఆహారం తినిపిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.