Cow: గోమాతకు వీటిని ఆహరంగా పెడితే.. ఏం జరుగుతుందో మీకు తెలుసా?

హిందువులు గోమాతని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. గోమాతకు తరచూ బొట్లు పెట్టి పూజలు కూడా చేస్తూ ఉంటారు. కొన్ని పెద్ద పెద్ద ఆలయాల్లో ప్రత్యేకంగా

  • Written By:
  • Publish Date - June 19, 2024 / 03:40 PM IST

హిందువులు గోమాతని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. గోమాతకు తరచూ బొట్లు పెట్టి పూజలు కూడా చేస్తూ ఉంటారు. కొన్ని పెద్ద పెద్ద ఆలయాల్లో ప్రత్యేకంగా గోశాల అని కూడా ఏర్పాటు చేసి ఉంటారు. అయితే ఈ గోమాతలకు పచ్చి గడ్డి తో పాటు ఇంకా కొన్నింటిని తినిపించడం వల్ల కొన్ని రకాల మంచి జరుగుతుంది అంటున్నారు పండితులు. మరి గోవులకు ఏ ఆహార పదార్థాలు తినిపిస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గోమాతకి నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.

అలాగే ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతకి దోసకాయలను ఆహారంగా పెట్టాలి. దీనివలన శత్రు నివారణ జరుగుతుంది. అప్పులు ఎక్కువగా ఉన్నవారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించండం వలన రుణవిముక్తి పొందవచ్చు. అలాగే నిత్యం కుటుంబ సభ్యులకు గొడవలు పడుతూ ఉండేవారు నానబెట్టిన పచ్చిశనగలను గోవులకి తినిపించడం వలన మంచి ఫలితం ఉంటుంది. అలాగే పిల్లలు విద్యారంగంలో ఎదగాలని కోరుకునే తల్లిదండ్రులు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పుని తినిపించాల్సి ఉంటుంది.

అలాగే గోమాతకి నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. అలాగే ఉద్యోగం రాకుండా ఉన్నవారు, ఉద్యోగం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న వారు గోమాతకి గోధుమ పిండి, బెల్లము కలిపి పెట్టడం వలన మంచి ఫలితం వస్తుంది. అలాగే పెళ్లి కాని వారు గోమాతకి టమాటాలను తినిపిస్తే మంచి ఫలితం వస్తుంది. అంతేకాకుండా త్వరలోనే మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు ఉంటారు. అలాగే గోమాత కి నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. అలాగే గోమాతకి బీట్రూట్, పాలకూర తినిపిస్తే ధనవంతులవుతారు.

అలాగే నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. నానబెట్టిన బొబ్బట్లు గోమాతకు పెట్టడం వలన ధనాభివృద్ధి కలుగుతుంది. అలాగే కొంచెం నీటిలో కలిపిన బియ్యం పిండిని గోమాతకు తినిపిస్తే ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకుండా ఉంటాయి. అలాగే నానబెట్టిన కందులని తినిపించడం వలన కోపం ఎక్కువగా ఉన్న వ్యక్తులకు కోపం తగ్గి ప్రశాంతంగా మెలుగుతారు. ఈ విధంగా ఈ ఆహార పదార్థాలను గోమాతలకు తినిపించడం వల్ల మంచి మంచి ప్రయోజనాలను పొందవచ్చు.