Site icon HashtagU Telugu

Fasting on Shivaratri: శివరాత్రి రోజు ఉపవాసం చేస్తున్నారా? వీటిని ఉపవాసంలో తినవచ్చు..

Fasting On Shivaratri These Can Be Eaten On Fasting.

Fasting On Shivaratri These Can Be Eaten On Fasting.

శివరాత్రి పండుగ రానే వచ్చింది. ఈ రోజున చాలా మంది ఉపవాసం (Fasting) ఉంటారు. ఇలాంటి టైమ్‌లో ఏం తినాలో తెలియదు చాలామందికి. అలాంటి వారు ఈ ఆర్టికల్ చూడండి. సాధారణంగా ఉపవాసం రోజున ఉదయమంతా ఉపవాసం (Fasting) ఉండి రాత్రి ఓసారి భోజనం చేస్తారు. ఈ టైమ్‌లో కొంతమంది వెల్లుల్లి, ఉల్లి తినరు. కొంతమంది కొన్ని తినరు. మొత్తానికి ఏం తినకుండా ఉండలేరు. కాబట్టి, కొన్ని పండ్లు తినొచ్చు. వాటితో పాటు పాలు, పాల పదార్థాలు తీసుకోవచ్చు. వీటితో ఇంకేం తినొచ్చు. ఎలాంటి ఫుడ్ ఐటెమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం.

డెయిరీ ప్రోడక్ట్స్:

కొంతమందికి టీ, కాఫీలు లేకపోతే అస్సలు కుదరదు. అలాంటివారు వాటి బదులు స్మూతీస్, షేక్స్‌లా చేసుకుని తాగొచ్చు. షుగర్ ఉన్నవారు పంచదార బదులు బెల్లం, తేనె, డేట్స్ వంటి వాటిని అందులో వాడొచ్చు. పెరుగు, మజ్జిగ, రైతా ఎంతగా వీలైతే అంతగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో జీర్ణ సమస్యలు వస్తాయి. పెరుగులోని ప్రోబయోటిక్స్ జీర్ణ సమస్యల్ని దూరం చేస్తాయి. తక్షణ శక్తి ఇస్తాయి.

పనీర్:

ఇక పనీర్‌ని కూడా తీసుకోవచ్చు. దీనిని క్యాప్సికమ్ ముక్కలతో కలిపి పనీర్ టిక్కా, పాయసం ఎలా అయినా తీసుకోవచ్చు. ఇందులోని ప్రోటీన్ మీకు ఆకలి కంట్రోల్ అయ్యేలా చేస్తుంది. కాబట్టి పనీర్ తినేందుకు ట్రై చేయండి. ఎలా అయినా తినొచ్చు. నెయ్యి కూడా ఈరోజు మీరు తీసుకోవచ్చు. నెయ్యి కూడా ఆకలిని కంట్రోల్ చేసి జీర్ణ సమస్యల్ని దూరం చేస్తుంది.

పండ్లు:

ఈ సమయంలో ఎక్కువగా పండ్లు తింటారు. మీకు ఇష్టమైన పండ్లు ఏవైనా తినొచ్చు. ఎలాగూ మార్కెట్లో పుచ్చకాయలు వచ్చాయి. కాబట్టి వాటిని తినడం మంచిది. దీని వల్ల నీటి శాతం ఎక్కువగా ఉన్న ఈ పండుని తినడం వల్ల డీహైడ్రేషన్ లేకుండా ఉంటుంది. వీటితో పాటు బొప్పాయి, ద్రాక్ష, ఖర్జూరాలు తినడం మంచిది వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవ్వడమే కాకుండా శక్తి వస్తుంది.

జావ:

రాగిజావ, అంబలి వంటివి కూడా చేయొచ్చు. సాబుదానతో జావ చేసి తాగితే నీరసం రాకుండా ఉంటుంది. వీటితో పాటు చపాతీలు, పూరీలు చేసుకుని తినొచ్చు.

నట్స్, డ్రై ఫ్రూట్స్:

నట్స్, డ్రై ఫ్రూట్స్‌లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో వాల్‌నట్స్, బాదం, ఖర్జూరాలు, పిస్తాపప్పులు, ఎండుద్రాక్షలు తినొచ్చు. వీటిని నానబెట్టి తింటే త్వరగా జీర్ణమవుతాయి.

ఆలు కిచిడి:

ఆలు కిచిడి తినొచ్చు. వీటి వల్ల కడుపు నిండుగా ఉండడమే కాకుండా నీరరసం కూడా రాదు. సగ్గుబియ్యంలో ఆలు వేసి వండుకోవచ్చు. ఆలు పరాఠా చేసుకోవచ్చు. ఎలా అయినా వీటిని పూర్తిగా తినొచ్చు.

స్వీట్ పొటాటో:

చిలగడదుంపలు ఈ సీజన్‌లో బాగానే ఉంటాయి. వీటిని కూడా తీసుకోవడం వల్ల నీరసం రాదు. కడుపు నిండుగా అనిపిస్తుంది. వీటిని ఉడికించి, కాల్చి ఎలా అయినా తినొచ్చు.

పాయసం:

ఈ సమయంలో పాయసం తీసుకోవడం వల్ల పాలు తీసుకున్నట్లుగా ఉంటుంది. కడుపు నిండుగా అనిపిస్తుంది. కాబట్టి, వీటిని హ్యాపీగా తినొచ్చు. ఇందులో సేమియాతో చేసుకోవచ్చు. అందులో సగ్గు బియ్యం, పనీర్ వేసుకుని ఎలా అయినా చేసి తినొచ్చు. దీని వల్ల హ్యాపీగా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది.

Also Read:  Uric Acid: యూరిక్‌ యాసిడ్‌.. గౌట్ సమస్యలను జయిద్దాం