జాగరణ అంటే ఊరికే మేల్కొని ఉండడం కాదు.. భగవంతుడి అస్తిత్వంలో మనసు లగ్నమై ఉండటమే జాగరణ. భగవంతుడిని తలుచుకుంటూ మేల్కొని ఉండాలి కానీ భౌతికంగా మేల్కొని ఉంటూ ఏవేవో కాలక్షేపాలు చేయడం కాదు. రాత్రిపూట శివుడు లింగోద్భవం అయ్యాడు కాబట్టి.. పగలంతా ఆయన రాకకోసం వేచిచూస్తూ..పరమేశ్వరుడు ఆవిర్భవించగానే భక్తితో అర్చించేదుకే ఉపవాసం, జాగరణ చేస్తారు. అయితే జాగరణ – ఉపవాసం (Vigilantes) చేయాలి అనుకుంటే కొన్ని నియమాలు పాటించాలి.
మహా శివరాత్రి జాగరణ – ఉపవాసం (Vigilantes) నియమాలు
- మహాశివరాత్రి జాగరణ, ఉపవాసం చేయాలి అనుకుంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. సూర్యోదయం తర్వాత నిద్రలేచిన వారు చేసే జాగరణ ఫలితాన్నివ్వదు
- వేకువజామునే స్నానమాచరించి భక్తిశ్రద్ధలతో భోళాశంకరుడిని పూజించాలి
- పూజ సమయంలో శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి.
- జాగరణ అంటే భౌతికంగా మేల్కొని ఉండాలన్న ఆలోచనతో ఏదో టైమ్ పాస్ చేయడం కాదు… రోజంతా పంచాక్షరి నామస్మరణలో, శివయ్య నామస్మరణలో గడపాలి
- శివరాత్రి రోజున శివ లింగం దగ్గర నేతి దీపం వెలిగించడం శుభప్రదం
- శివరాత్రి ఉపవాసం ఫలితం సంపూర్ణంగా దక్కాలంటే మర్నాడు చతుర్థశి తిథి ముగిసేలోగా ఉపవాసం విరమించాలి
- అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఒక్కపూట భోజనం చేసి శివనామస్మరణలో గడిపినా మంచిదే
- శివరాత్రి ఉపవాసం ఉండేవారు పాలు, పండ్లు లాంటి సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి
మహాశివరాత్రి రోజు చేయకూడని పనులు
- మహాశివరాత్రి రోజు ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం తీసుకోరాదు
- శివారాధన చేసేవారు పొగాకు, మద్యానికి ఈరోజు దూరంగా ఉండాలి
- శివారాధనకు పొరపాటున కూడా తులసిని ఉపయోగించకూడదు
- శివుడికి సమర్పించే బిల్వ పత్రాలు, శమీ పత్రాల తొడిమె మొదటి భాగాన్ని తీయకుండా సమర్పించరాదు
- ప్యాకెట్ పాలతో అభిషేకం చేయరాదు..ఆవుపాలతో చేయాలి
- పూజ మధ్యలో లేవకూడదు
- పూజ, ఆరాధన మధ్యలో మాట్లాడటం – ఆవేశానికి లోనవడం అస్సలు చేయరాదు
- జాగరణ చేసేవారు రాత్రంతా నడుం వాల్చడం కూడా సరికాదంటారు పండితులు
- శివరాత్రి రోజు నల్లని దుస్తులు అస్సలు ధరించకూడదు
Also Read: Maha Shivaratri: శివుడు స్వయంగా పార్వతికి చెప్పిన కథ ఇది