Site icon HashtagU Telugu

Dreams: మీకు కలలో అవి కనిపించాయా.. అయితే మీ తలరాత మారిపోయినట్టే?

Mixcollage 15 Jan 2024 06 33 Pm 9289

Mixcollage 15 Jan 2024 06 33 Pm 9289

సాధారణంగా నిద్రపోతున్నప్పుడు మనకు అనేక రకాల కలలు రావడం అన్నది సహజం. ఇక కలలో పక్షులు జంతువులు మనుషులు గతంలో జరిగిన సంఘటనలు ఇలా ఏవేవో కనిపిస్తూ ఉంటాయి. దీంతో కొంతమంది పీడకలలు వచ్చినప్పుడు దిగులు చెందుతూ ఆందోళన చెందుతూ ఉంటారు. స్వప్న శాస్త్ర ప్రకారం కలలు ఎప్పుడూ భవిష్యత్తును సూచిస్తాయని చెబుతూ ఉంటారు. అందులో కొన్ని శుభ సూచకాలైతే మరికొన్ని అశుభానికి ప్రతీకలు కావచ్చు. అయితే కలలో మనకు కొన్ని రకాల కలలో మన అదృష్టం మారబోతుంది అని చెప్పడానికి సంకేతంగా భావించాలి.. మరి ఎటువంటి కలలు రావడం మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బంగారాన్ని కలలో చూడడం అంటే సంపద ఆభరణాలు లాంటి విలువైన వస్తువులను కలిగి ఉండడం అని చెప్తున్నారు. ఇక బంగారాన్ని కలగనడం సంపన్నంగా ఉండడాన్ని వ్యక్తికరించచ్చు. బంగారాన్ని ధరించినట్లు కలగంటే ఆభరణాలు అపార సంపదలు మీ జీవితంలోకి త్వరలోనే వస్తాయని సంకేతం. మీ కలలో బంగారు బహుమతిని అందుకోవడం కూడా మీకు త్వరలో పనిలో అత్యంత గౌరవమైన స్థానాన్ని సాధిస్తారని చెప్తుంది. కలలోకి ధాన్యం వస్తే కూడా కలిసి వస్తుంది అని చెప్తారు. ధాన్యాలు భూమి పుష్కలమైన వరాలలో ఒకటిగా పరిగణిస్తారు. ధాన్యాల గురించి కల కనడం కంటే అదృష్టం మీకు సమృద్ధిగా ఎదురు చూస్తుందని అర్థం.

మీ కలలో ఎనిమిదవ సంఖ్యను చూడడం అంటే సంపద విజయం భౌతిక లాభాలు చేకూరుతాయని అర్థం. ముఖ్యంగా ఆసియా సంస్కృతిలో ఎనిమిది అనే సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిగణించబడుతుంది. అందుకే కలలో 8 సంఖ్య వస్తే అదృష్టంగా చెప్తారు. కలలో గంభీరమైన డేగలు కనిపిస్తే ధైర్యానికి ప్రత్యేకంగా భావిస్తారు. డేగలు కలలో కనిపిస్తే వారి సంకల్పం నెరవేరుతుంది. పక్షుల గురించి కలలు కనడం సాఫల్యం కోసం మీ దృఢ సంకల్పాన్ని తెలియజేస్తుంది. వండిన మాంసాన్ని తినడం గురించి కలలు కనడం వల్ల సంపద పెరుగుదలను సూచిస్తుంది. డబ్బు గురించి కలలు కనడం భౌతిక ధన లాభం ఆర్థిక ఆశీర్వాదం యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది. మీకు పైన చెప్పిన వాటిలో ఏది కనిపించినా కూడా మీకు అదృష్టం పట్టిపీడించబోతుందని ఆర్థిక సమస్యలు దూరం కాబోతున్నాయని సంకేతంగా భావించాలి.