తిరుపతి (Tirupati) నగరంలో శ్రావణ మాసం (Sravanamasam) ప్రారంభమైన మొదటి రోజే ఓ అద్భుత సంఘటన చోటుచేసుకుంది. గాంధీపురం ప్రాంతంలో ఉన్న ఓ చిన్న శివాలయంలో పరమశివుడు కళ్లు (Eyes Open Shiva Lingam) తెరిచినట్టుగా కనిపించడంతో భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. శివలింగంపై స్వయంగా ఏర్పడిన రెండు కళ్ల ఆకృతులు స్పష్టంగా దర్శనమివ్వడం, ఆ కళ్లు వెలుగులు వెదజల్లుతున్నట్టుగా భక్తులు భావించడంతో ఈ ఘటన మహా అద్భుతంగా మారింది. ఈ అనూహ్య ఘటనతో స్థానికులు శివలీలగా భావిస్తూ ఆలయానికి పోటెత్తారు.
ఆ ఆలయం ఎదుట శివనామ స్మరణతో భక్తుల రద్దీ కిక్కిరిసి పోయింది. “ఓం నమ: శివాయ” నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా శివుని దయకు నిదర్శనంగా భావిస్తూ, కొంతమంది దీక్షలు తీసుకుంటున్నారు. పూల మాలలు, కర్పూర దీపారాధనలతో శివునికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ కమిటీ ఈ అంశంపై ఇంకా అధికారికంగా స్పందించకపోయినా, ప్రజల విశ్వాసం ఈ సంఘటనను ఎంతో పవిత్రంగా మార్చింది.
Banakacherla : బనకచర్లకు అనుమతి ఇవ్వొద్దు.. కేంద్రానికి తెలంగాణ లేఖ
ఈ మధ్యకాలంలో అలాంటి అద్భుతాలు కేవలం సినిమాల్లో లేదా పురాణ గాధల్లోనే చూస్తూ ఉంటాం. కానీ, ఈ ఘటన నిజంగా తలెత్తడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కొన్ని ఆధ్యాత్మిక వర్గాలు ఇది స్వతంత్ర ఆధ్యాత్మిక సంకేతంగా భావిస్తున్నాయి. శివుడు భక్తుల మనోభావాలను తెలుసుకొని ప్రత్యక్షమయ్యాడని వారు అభిప్రాయపడుతున్నారు. కొందరైతే ఇది మానవ చేతి కలకలపుగా ఉండొచ్చని అంటున్నా, వారి వాదనలు జన విశ్వాసం ముందు నిస్సారంగా మారిపోయాయి.
ఇంకా శ్రావణ మాసం మొదలైన ఈ పవిత్ర సమయంలో ఈ ఘటన జరగడం భక్తుల్లో మరిచిపోలేని అనుభూతిని కలిగించింది. శివుడి కళ్లు తెరుచుకున్నట్టుగా కనిపించడాన్ని భక్తులు మహాశుభసూచకంగా భావిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది.