Site icon HashtagU Telugu

Banana: ఉదయం రాత్రి రెండు పూటలా అరటిపండు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Mixcollage 04 Jul 2024 09 20 Am 7534

Mixcollage 04 Jul 2024 09 20 Am 7534

మార్కెట్లో మనకు ఏడాది పొడవునా లభించే పండ్లలో అరటి పండ్లు కూడా ఒకటి. అరటి పండు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఎలాంటి భయాందోళనలో లేకుండా ఈ అరటిపండును తినవచ్చు. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి అంటున్నారు వైద్య నిపుణులు. ఇందులో ఉండే ఫైబర్, కాపర్, కార్బోహైడ్రేట్లు, విటమిన్ b6, పొటాషియం మెగ్నీషియం, విటమిన్ సి వంటి పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. అరటిపండు తినడం మంచిదే కానీ ఏ సమయంలో తినాలో తెలియదు చాలామంది సందేహబడుతూ ఉంటారు.

మరి ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎసిడిటీ సమస్యని నివారించడానికి ఉదయాన్నే అరటిపండ్లు తినడం మంచిది అంటున్నారు పోషకాహార నిపుణులు. కానీ చాలామంది ఉదయాన్నే అరటిపండును తినడానికి అంతగా ఇష్టపడరు. కానీ సమస్య ఉన్నవారు కాస్త ధైర్యంగా ఉదయాన్నే అరటిపండు తింటే మాత్రం మంచి ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు.. అలాగే దగ్గు, ఆస్తమా, సైనస్,జలుబు వంటి సమస్యలతో బాధపడేవారు రాత్రి సమయంలో అసలు అరటిపండు తినకూడదు అంటున్నారు నిపుణులు. నిద్రపోయే ముందు అరటిపండు తినడం వల్ల శ్లేష్మం పెరిగే ప్రమాదం ఉంటుందట. ఫలితంగా సమస్య మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

అదేవిధంగా అరటిపండ్లు మలబద్దకాన్ని నివారించడానికి కూడా గొప్పగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు నిపుణులు. ఉదయం పరగడుపున రెండు గ్లాసుల నీళ్లు తాగిన తర్వాత అరటిపండు తినడం మంచిదట. అరటిపండు తినడానికి ఇష్టపడని వారు ఎండు ద్రాక్ష బాదం పప్పులు కూడా తినవచ్చు. అయితే రాత్రిపూట అరటిపండు తినడం వల్ల ఊబకాయం వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయట. కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు అరటిపండుకు దూరంగా ఉండడమే మంచిదట. అలాగే మన శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్ సి, విటమిన్ బి 6 తో సహా ఎన్నో ఇతర ముఖ్యమైన ఖనిజాలు, ఫోలేట్ మొదలైనవి అరటిపండ్లలో పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ఇవి ఎన్నో ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తాయని చెబుతున్నారు.

Note : ఈ ఆరోగ్య సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమేనని గమనించాలి.