Vasthu Tips: కోరుకున్న ఉద్యోగం సంపద కావాలా.. అయితే ఈ వాస్తు చిట్కాలను పాటించాల్సిందే?

జీవితంలో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని ప్రతి ఒక్కరు కష్టపడుతూ ఉంటారు. కష్టపడి సంపాదించడంతోపాటు ఉద్యోగం రావాలని మంచి సంపాదన ఉండాలని కోరుక

  • Written By:
  • Publish Date - May 12, 2023 / 05:10 PM IST

జీవితంలో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని ప్రతి ఒక్కరు కష్టపడుతూ ఉంటారు. కష్టపడి సంపాదించడంతోపాటు ఉద్యోగం రావాలని మంచి సంపాదన ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఎంత కష్టపడినా ఫలితం రాకపోయేసరికి చాలామంది నిరాశ చెందుతూ ఉంటారు. కోరుకున్న ఉద్యోగం దొరకటం, ఉద్యోగంలో ఎలాంటి సమస్యలు లేకుండా కెరీర్ విజయవంతంగా సాగించాలి అంతే కొన్ని వాస్తు చిట్కాలను పాటించాలి అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇంటిని వాస్తు ప్రకారంగా నిర్మించుకోవడంతో పాటుగా ఇంట్లో ఉండే ప్రతి ఒక వస్తువుని అమర్చుకోవడం కూడా తప్పనిసరి. అలాగే శరీరంలోని ప్రతి భాగం ఒకదానితో ఒకటి అనుసంధానించి ఉన్నట్టుగానే ఇంట్లోని ప్రతి దిశ, స్థానం అనుసంధానించబడి ఉంటాయి.. అయితే ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు విద్యార్హతలు టాలెంట్ తో పాటుగా అదృష్టం కూడా తోడు ఉండాలి. అదృష్టం విషయంలో వాస్తు ముఖ్యపాత్ర పోషిస్తుంది అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఉద్యోగం రావడానికి వాస్తుకి సంబంధం ఏంటా అని అనుకుంటున్నారా. మనం రోజులో ఎక్కువ సమయం మనం గడిపేది ఇంట్లోనే కాబట్టి ఇంట్లోని ఎనర్జీస్ సరిగ్గా లేకపోతే అది మన జీవితం పై కూడా ప్రతికూల ప్రభావం కలిగిస్తుంది.

కాగా ధనానికి, సంపదలకు అధిపతి కుబేరుడు. ఇంట్లో కుబేర స్థానం ఉత్తర దిక్కు. కనుక అక్కడి వైపు కూర్చుని పని చేసుకోవడం మంచిది. లాప్ టాప్, మొబైల్ వంటి గాడ్జెట్స్ చార్జింగ్ పాయింట్స్ గదిలోని ఆగ్నేయ దిక్కున ఉండాలి. మీరు విజయవంతమైన వ్యాపారవేత్త కావాలని అనుకుంటే మీరు అమ్మకానికి పెట్టే వస్తువులను వాయవ్యంలో నిల్వ చెయ్యాలి. ఈ దిక్కుకు అధిపతి వాయువు. దక్షిణ దిశలో కిటికీలు ఉండకూడదు. మంచి నిర్ణయాలు తీసుకోవడం కోసం తూర్పు లేదా ఈశాన్యం వైపు కూర్చోవడం మంచిది. ఈ చిన్నచిన్న నియమాలను కచ్చితంగా పాటిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, కర్మను ఫలాపేక్ష లేకుండా నిర్వహించడం, పరుష పదజాలం వాడకపోవడం, పనివారితో మర్యాదగా నడుచుకోవడం, పరిధికి లోబడి ఇతరులకు సహాయపడడం, ఎవరి మనసు నొచ్చుకోకుండా జాగ్రత్త పడడం, తెలిసి తప్పు చెయ్యకపోవడం వంటి కొన్ని జాగ్రత్తలు కూడా పాటిస్తే తప్పకుండా విజయం మిమ్మల్ని వరిస్తుంది.