Site icon HashtagU Telugu

Shani Dev: శని దోష నివారణకు 7 పరిహారాలు పాటిస్తే చాలు!

Mixcollage 06 Feb 2024 08 18 Pm 2504

Mixcollage 06 Feb 2024 08 18 Pm 2504

చాలామంది శనీశ్వరుడు పేరు వినగానే తెగ భయపడిపోతూ ఉంటారు.. ఆయనను పూజించాలి అన్న ఆయన గుడికి వెళ్లాలన్నా చాలామంది సంకోచిస్తూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే శని దేవుని అనుగ్రహం ఒక్కసారి కలిగింది అంటే చాలు ఎంత పేదవాడైనా సరే కోటీశ్వరులు అవ్వాల్సిందే. కానీ ఆయన గుడికి వెళ్లేవారు తప్పులు చేయకుండా ఎప్పుడు మంచి మార్గంలోనే నడుస్తూ అందరి మంచి కోరుకుంటూ ఉండాలి. అప్పుడే శని మనపై ఆగ్రహించకుండా ఉంటారు. అయితే చాలామంది శని దోషం నివారణకు ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు వాటి వల్ల ఫలితం ఉండదు. మరి శని దోష నివారణ అవ్వాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇందుకు ఏడు పరిహారాలను తప్పకుండా పాటించాలి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దేవతలు, మునులు కూడా శనీశ్వరుడి వక్రదృష్టికి భయపడతారనే నమ్మకం మొదటి నుంచి ఉంది. శ్రీరాముడి నుంచి రావణాసురుడి వరకు శని కోపానికి గురవ్వాల్సి ఉంటుందని అంటారు. జ్యోతిష్యంలో శని వక్రదృష్టిని నివారించడానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఎవరికీ ఎప్పుడూ అన్యాయం చేయకూడదు. బలహీనులను హింసించవద్దు. పేదలకు, నిర్భాగ్యులకు సేవ చేయాలి. శని భగవానుడు ఇటువంటి వ్యక్తులపట్ల సంతోషంగా ఉంటాడు. ఇలాంటి పనులు చేయడం వల్ల వక్ర దృష్టి నుంచి బయటపడవచ్చు. పలు సమస్యలు ఎదురు కాకుండా ఉండేందుకు చేతికి ఇనుప ఉంగరం ధరించాలి.

బాధలు తొలగిపోవడానికి, దేవతల అనుగ్రహంతో ఆశీర్వాదాలు పొందడానికి పూజలు ఏర్పాటు చేశారు. శనిదేవుడి సమస్యలవల్ల ఇబ్బంది పడుతుంటే శనివారం రోజు ఆవాల నూనెను శనికి నైవేద్యంగా పెట్టి 108 శని మంత్రాన్ని జపించాలి. ప్రతిరోజు శివుడిని పూజించాలి. ఆయన్ని పూజిస్తూ మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి.
శనివారం నూనెను దానం చేయడం శుభప్రదం. ఒక పాత్రలో ఆవ నూనె తీసుకుని అందులో రూపాయి నాణెం వేస్తే ఆ నూనెలో మీ ముఖాన్ని చూసుకుని తర్వాత ఆ నూనెను అవసరమైన వారికి దానం చేయాలి. శని కష్టాలను తొలగించడానికి మహా కాళీ అమ్మవారిని ఆరాధించడం మంచి ఫలితంగా పరిగణిస్తారు. శని దేవుడిచ్చే దుష్ప్రభావాలను నివారించడానికి సంకట్ మోచన భజరంగ బలిని ఆరాధించాలి. తర్వాత భైరవుడిని పూజించాలి.