శ్రావణమాసంలో ప్రతి ఇల్లు ఓ దేవాలయంలా మారిపోతుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు పూటలా ప్రత్యేక పూజలతో ఇళ్లలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ పవిత్ర మాసంలో చేసే కొన్ని పూజల వల్ల ఎంతో మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. శ్రావణమాసంలో ఇంట్లో తులసి మొక్క నాటితే…ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని వాస్తునిపుణులు అంటున్నారు. ఇవేకాదు వాస్తు ప్రకారం ఇంకొన్ని మొక్కలు ఇంట్లో నాటికి అంతా మంచి జరుగుతుందంటున్నారు. వాటి వల్ల ఇంట్లో మనశ్శాంతితోపాటు ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయని చెబుతున్నారు. మరి శ్రావణ మాసంలో నాటాల్సిన మొక్కల గురించి తెలుసుకుందాం.
జమ్మి:
ఇంట్లో జమ్మి మొక్కను నాటితే శనిదేవుడి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే అంతా శుభ కలుగుతుందట. జమ్మితోపాటుగా తులసిని కూడా కలిపి నాటితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.
అరటి:
అరటిమొక్కను మీ ఇంటి ఆవరణలోని ప్రధాన ద్వారానికి కుడివైపున నాటండి. ఇలా నాటడం వల్ల ప్రతికూలతను పోగొట్టడంతోపాటు సానుకూల ఫలితాలొస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు.
ఉమ్మెత్త :
ఈ మొక్క శివుడికి ఎంతో ఇష్టమని చెబుతుంటారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే చాలా మంచిదట. శ్రావణ సోమవారం శివుడికి ఉమ్మెత్త పూలతో పూజచేస్తే అంతా శుభం కలుగుతుంది. శివుడు ఈ పూలలోనే కొలువై ఉంటాడని నమ్ముతుంటారు. ఈ మొక్క ఆదివారం లేదా మంగళవారం రోజున ఇంట్లో నాటండి.
చంపా:
వాస్తు శాస్త్రం ప్రకారం…ఏ ఇంట్లో అయితే అరటి, చంపా మొక్కలు నాటుతారో ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవని చెబుతుంటారు. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందడంతోపాటుగా డబ్బుకు సంబంధించిన ప్రయోజనాలను పొందుతారు. ఈ మొక్కను మీ ఇంట్లో వాయువ్య దిశలో నాటండి. శుభఫలితాలను పొందుతారని పండితులు చెబుతున్నారు.