ఎమరాల్డ్ అనేది ఒక ఆకుపచ్చ రత్నం, ఇది బుధ గ్రహానికి సంబంధించినదని నమ్ముతారు. అయితే రత్న శాస్త్రం ప్రకారం, ఆకుపచ్చ రత్నం ధరించడం ద్వారా బుధ గ్రహం బలపడుతుందట. జాతకంలో గ్రహాల స్థానం, రాశి చక్రాన్ని బట్టి రత్నాలు ధరించాలని పండితులు సూచిస్తున్నారు. ఆకుపచ్చ రత్నం ధరించడానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయట. ఆకుపచ్చ రత్నం సరైన పద్ధతిలో, సరైన పద్ధతిలో ధరిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. దీనిని ధరించడం వల్ల పురోగతి, తెలివితేటలు పెరుగుతాయట.
మానసిక ప్రశాంతత లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే తప్పకుండా ఈ ఉంగరాన్ని ధరించే ముందు కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. మరి ఇలాంటి విషయాలు గుర్తుంచుకోవాలి అన్న విషయాన్ని వస్తే.. బుధుడితో సంబంధం ఉన్నందున, బుధవారం ఆకుపచ్చ రత్నం ధరించడం శుభప్రదంగా భావిస్తారు. అదే సమయంలో, దీనిని ధరించే ముందు శుద్ధి చేయడం చాలా అవసరమని భావిస్తారు. కాగా ఆకుపచ్చ రత్నాన్ని బంగారం లేదా వెండి లోహంలో అమర్చి ధరించవచ్చు. బుధవారం గంగాజలంతో, పాలతో శుద్ధి చేయాలి. ఈ విధంగా శుద్ధి చేసిన తర్వాతనే ఆ రత్నాన్ని ధరించాలని చెబుతున్నారు. చిటికెన వేలుకు ఆకుపచ్చ రత్నాన్ని దరించాలి.
రేవతి, ఆశ్లేష, జ్యేష్ఠ నక్షత్రం నాడు కూడా దీనిని ధరించవచ్చని చెబుతున్నారు. అలాగే జ్యోతిషశాస్త్రం ప్రకారం మకర, మిథున, కుంభ, కన్య, వృషభ, తులా రాశి వారు ధరించవచ్చట. అదే సమయంలో మేష, కర్కాటక, వృశ్చిక రాశి వారు ఈ రత్నాన్ని ధరించకూడదని చెబుతున్నారు. జాతకంలో బుధుడి స్థానాన్ని చూసిన తర్వాతే ఆకుపచ్చ రత్నం ధరించాలట. ఆకుపచ్చ రత్నం ధరించే ముందు గ్రహాల స్థితిగతులను గమనించి జ్యోతిష్యుడి సలహా తీసుకోవడం మంచిదని అలా కాకుండా ఎలా పడితే అలా ఆ ఉంగరాన్ని ధరిస్తే ఫలితాలు కనిపించవని చెబుతున్నారు.