Site icon HashtagU Telugu

Elinati Shani : జాతకంలో ఏలినాటి శని ఉంటే పెళ్లి చేసుకోవచ్చా ?

Elinati Shani Effect on Marriage

Elinati Shani Effect on Marriage

Elinati Shani : ఏలినాటి శని.. అంటే ఏడున్నర ఏళ్లపాటు ఉండేది. జాతకంలో ఏలినాటి శని ఉంటే.. ఆ వ్యక్తులు ఉద్యోగ, వ్యాపార రీత్యా ఎదగలేరని, కుటుంబ పరిస్థితులు కూడా బాగుండవనేది నమ్మకం. జాతకాలను నమ్మేవారంతా ఇలాంటి విషయాలను బలంగా నమ్ముతారు. అంతేకాదు. ఏలినాటి శని జాతకంలో ఉంటే.. చాలా కష్టాలు కూడా ఉంటాయంటారు. ఇవన్నీ సరే. జాతకంలో ఏలినాటి శని ఉంటే పెళ్లి చేసుకోవచ్చా ? చేసుకోకూడదా ?

శని దేవుడిని కర్మకారకుడిగా చెబుతారు. మనం చేసే కర్మల ఫలితాలనే ఆయన ప్రసాదిస్తాడు. రెండేళ్లకొకసారి శని రాశి మారుతాడు. ఇలా రాశి మారినపుడు.. సంచరించే రాశికి ముందు, తర్వాత ఉన్న రాశుల వారికి ఏలినాటి శనికాలం ప్రారంభమవుతుంది. గత రాశిలో రెండున్నరేళ్లు, సంచరించే రాశిలో రెండున్నరేళ్లు, తర్వాతి రాశిలో రెండున్నరేళ్లు మొత్తం ఏడున్నర సంవత్సర కాలాన్ని ఏలినాటి శని కాలంగా చెబుతారు.

ఎవరైనా వివాహానికి ముందు తమ జాతకాన్ని కచ్చితంగా చూపించుకుంటారు. మరి ఏలినాటి శని జాతకంలో ఉంటే పెళ్లవుతుందా ? అనే అనుమానం ఉంటుంది. కచ్చితంగా అవుతుందని పండితులు చెబుతున్నారు. శని మీ జాతకంలో ఏడో ఇంటితో లేదా వివాహానికి సంబంధించిన గ్రహాలతో సంబంధముంటే వివాహ యోగం ఏడున్నర శనికాలంలో జరుగుతుంది. కానీ.. వైవాహిక జీవితంలో అయోమయాలు తలెత్తుతాయని కూడా అంటారు. అలాగే ఆలుమగల మధ్య సఖ్యత తగ్గుతుందని, అనారోగ్యం, సంతానం, మాంగల్యబలం తక్కువగా ఉండటం, దాంపత్య జీవితంలో సుఖసంతోషాలు పోయి కష్టాలు పెరుగుతాయని చెప్తారు.