Site icon HashtagU Telugu

Elephant Idols: ఇంట్లో ఏనుగు బొమ్మ ఉంటే అదృష్టం కలిసివస్తుందా.. పండితులు ఏం చెబుతున్నారంటే!

Elephant Idols

Elephant Idols

మామూలుగా చాలామంది ఇంట్లో రకరకాల విగ్రహాలను పెట్టుకుంటూ ఉంటారు. హాల్లో సెల్ఫుల్లో అలంకరణ కోసం రకరకాల పదార్థాలతో తయారుచేసిన చిన్న చిన్న పక్షులు జంతువుల విగ్రహాలను పెట్టుకుంటూ ఉంటారు. అటువంటి వాటిలో ఏనుగు విగ్రహాలు కూడా ఒకటి.. కొందరు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన ఏనుగు విగ్రహాలు పెట్టుకుంటే మరి కొందరు వైట్ సిమెంట్ ఇంకొందరు, పింగాని ఇంకొందరు గాజు, లేదా వెండితో తయారు చేసిన లోహంతో తయారు చేసిన ఏనుగు విగ్రహాలను పెట్టుకుంటూ ఉంటారు. చాలావరకు వెండి విగ్రహాలు లేదా లోహంతో తయారు చేసిన ఏనుగు విగ్రహాలని పెట్టుకుంటూ ఉంటారు.

ఈ ఏనుగు విగ్రహాలు అదృష్టాన్ని తెచ్చి పెడతాయని చెబుతున్నారు పండితులు. ఏనుగు విగ్రహాలు అదృష్టం తెచ్చి పెట్టడం ఏంటా అని అనుకుంటున్నారా, ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ ఏనుగు బొమ్మల్లో కూడా తొండాన్ని పైకి ఎత్తి ఉంచిన బొమ్మ నిజంగానే అదృష్టం కలిసి వస్తుందట. మన ఇంటి గేటు మీద ఏనుగు బొమ్మలు ఉంచినట్లయితే దుష్ట శక్తులు మన ఇంటి లోపలి ప్రవేశించట. అందుకే మన పురాతన దేవాలయాల్లో ప్రవేశద్వారం దగ్గర ఏనుగు బొమ్మలు పెట్టేవారు. అవి చెడు శక్తులను లోపలకి రానీయవట. అలాగే బెడ్ రూమ్ లో రెండు ఏనుగులు జతగా ఉన్న ఫోటోలు పెట్టినా దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి మంచి సంతానం కలుగుతుందని చెబుతున్నారు. పిల్లలు చదువుకునే టేబుల్ ఫై ఏనుగు బొమ్మని పెడితే వాళ్లకి విజ్ఞానం పెరిగి మంచి జ్ఞాపకశక్తి కూడా వస్తుందని చెబుతున్నారు.

అలాగే కొంత మంది ఇళ్ళల్లో పిల్లలు పెద్దయ్యాకా వాళ్లతో కొన్ని ఇబ్బందులు ఎదురై పిల్లలు చెప్పిన మాట వినకుండా వాళ్ళ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తూ తల్లితండ్రులకి బాధని మిగులుస్తూ ఉంటారు. అలాంటి ఇంట్లో తల్లికి పిల్లలకి మధ్య సత్సబంధాలు పెరగాలంటే ఒక పెద్దఏనుగు దాన్ని పిల్ల గున్న ఏనుగుతో కలిసి ఉన్న బొమ్మను గాని, ఫోటోని గాని పెడితే మంచి ఫలితం కనిపిస్తుందట. ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్ఠలు వచ్చి స్థిరపడాలంటే ఏనుగు బొమ్మ మీద కోతి కూర్చుని ఉన్న బొమ్మ గాని ఫోటో గాని ఇంట్లో పెట్టుకోవాలట. ఇలా చెయ్యటం వల్ల ఉద్యోగంలో మంచి అభివృద్దిని చూడగలరు. అలాగే వ్యాపారస్తులు తమ షాప్స్ లో కౌంటర్ దగ్గర ఏనుగు బొమ్మను ఉంచినట్టయితే అది కస్టమర్స్ ని ఆకర్షించి వ్యాపారంలో లాభాలను తీసుకువస్తుందట. ఇలా తొండం పైకి ఎత్తి ఉంచిన ఏనుగు బొమ్మలు, విగ్రహాలు అవి ఉండాల్సిన స్థానాల్లో ఉంచితే మనకు మంచి ఫలితం కలుగుతుందట. అయితే ఇంట్లో పెట్టే బొమ్మలు ఇంటి లోపలి వైపు చూస్తునట్టు పెట్టాలి గాని అవి బైటకి చూస్తునట్టు, తొండం బైట వైపు చూపిస్తునట్టు ఉండకూడదట.