Shani Dev: ఏలినాటి శని పట్టిపీడిస్తోందా.. అయితే ఇలా తొలగించుకోండి?

మాములుగా ఏలినాటి శని ప్రభావం నడుస్తోంది అని అంటూ ఉంటారు. శని తన సొంత రాశిలో ప్రవేశించినప్పుడు కొన్ని రాశుల వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారం

  • Written By:
  • Publish Date - August 7, 2023 / 09:50 PM IST

మాములుగా ఏలినాటి శని ప్రభావం నడుస్తోంది అని అంటూ ఉంటారు. శని తన సొంత రాశిలో ప్రవేశించినప్పుడు కొన్ని రాశుల వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది. ఇతర గ్రహాలకంటే శని నెమ్మదిగా కదులుతుంది. ఈ కారణంగా శని ప్రభావం అత్యధికంగా ఉంటుంది. శని బుధుడు, శుక్రుడు, రాహువులతో స్నేహపూర్వకంగా ఉంటాడు. కాగా శని అత్యంత ప్రభావవంతమైన, శక్తిమంతమైన గ్రహం. శని న్యాయం, ప్రేమ చర్యలకు అనుగుణంగా ఫలితాలను ఇస్తాడు. శని శాపం తగిలితే చెడు ప్రభావాలు ఉంటాయి. ఈ కారణంగా శనిని పాపపు లేదా క్రూరమైన గ్రహంగా భావిస్తారు. శని, బుధుడు, శుక్రుడు, రాహువులతో స్నేహపూర్వకంగా ఉంటాడు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడితో శత్రుత్వాన్ని కలిగి ఉంటాడు.

బృహస్పతి, కేతువుతో కూడా ఇలాంటే సంబంధమే ఉంటుంది. శని తన సొంత రాశిలో ప్రవేశించినప్పుడు కొన్ని రాశుల వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది. ఇతర గ్రహాలకంటే శని నెమ్మదిగా కదులుతుంది. ఈ కారణంగా శని ప్రభావం అత్యధికంగా ఉంటుంది. మకరం, కుంభ రాశులకు అధిపతి శని ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారడానికి లేదా బదిలీ కావడానికి రెండున్నరేళ్ల సమయం పడుతుంది. ఈ విధంగా శని దాదాపు 30 ఏళ్లలో తన చక్రాన్ని పూర్తి చేస్తాడు. ప్రస్తుతం ధనస్సు, మకరం, కుంభ రాశుల్లో ఏలిననాటి శని ప్రభావం ఉంది. ఫలితంగా ఈ రాశుల వారి జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఏలిశని ప్రభావం మూడు దశల్లో ఉంటుంది. ఏలిననాటి శని అనే మాట వింటేనే చాలా మంది భయపడతారు. దీనికి సంబంధించిన భ్రమలు తొలగించుకోవాలి.

ఈ మూడు దశలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇకపోతే శని దోష పరిహారాలు విషయానికి వస్తే.. శని దోషాలను నివారించడానికి రావిచెట్టు కింద నువ్వుల నూనె, ఆవనూనెతో దీపం వెలిగించాలి. ప్రతి రోజు రావిచెట్టుకు 11 ప్రదక్షిణలు చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ నిధానంగా ప్రదక్షిణలు చేయాలి. అలాగే విష్ణు సహస్ర నామ పారాయణం చేయాలి. హనుమంతుడిని ఆరాధించాలి. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా లేదా సుందరకాండను పారాయణం చేయాలి. ఆంజనేయుడిని ఆరాధించడం ద్వారా శనిదోష నివృత్తి జరుగుతుంది. పరమేశ్వరుడిని ఆరాధించడం ద్వారా కూడా శనిదేవుడి సంతృప్తి చెందుతాడు. ఎందుకంటే శివుడు శని దేవుని గురువు. ఆయనను ఆరాధించడం వల్ల శనిదోషం తీవ్ర ప్రభావ స్వభావాన్ని తగ్గుతాడు. శనివారం శనిదేవుడికి సంబంధించి వస్తువులను నువ్వులు, నూనె, పత్తి, కాటన్ వస్త్రాలు, ఇనుప ఫర్నిచర్, లెదర్ చేయబడిన వస్తువులు దానం చేయాలి.