Lunar Month And Hanuman: మే 17 నుంచి జ్యేష్ఠమాసం ప్రారంభం, హనుమంతుడికి జ్యేష్ఠమాసానికి ఉన్న సంబంధం ఇదే…

హిందూ మతంలో ప్రతి మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెల ఏదో ఒక దేవతకు అంకితం చేయబడి ఉంటుంది, ఆ మాసంలో ఆయా దేవతలకు ఉపవాసాది పూజలు చేస్తారు.

  • Written By:
  • Publish Date - May 15, 2022 / 06:30 AM IST

హిందూ మతంలో ప్రతి మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెల ఏదో ఒక దేవతకు అంకితం చేయబడి ఉంటుంది, ఆ మాసంలో ఆయా దేవతలకు ఉపవాసాది పూజలు చేస్తారు. వైశాఖ మాసం ప్రస్తుతం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. దీని తర్వాత జ్యేష్ఠ మాసం, మే 17 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మాసంలో సూర్య దేవుడు, వరుణ దేవుడు, అలాగే హనుమంతునికి చాలా ప్రీతి పాత్రమైనది. ఈ మాసం హనుమంతుడికి ప్రత్యేకంగా ఆరాధన చేయడం ద్వారా సకల పీడల నుంచి విముక్తి పొందవచ్చు. పంచాంగం ప్రకారం, జ్యేష్ట మాసం 17 మే 2022 నుండి ప్రారంభమవుతుంది. జూన్ 14న జ్యేష్ఠ పూర్ణిమ 2022తో ముగుస్తుంది. జ్యేష్ఠ మాసం ప్రాముఖ్యతను ఈ మాసంలో ఏమి చేయాలి, ఏమి చేయకూడదో తెలుసుకుందాం.

జ్యేష్ఠ మాసం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ?
జ్యేష్ఠ మాసంలో సూర్యుని తాపం తారాస్థాయికి చేరుకుంటుంది. ఈ కారణంగా, ఈ మాసంలో నీటి ప్రాముఖ్యత పెరుగుతుంది. అందువల్ల ఈ నెలలో నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ మాసంలో సూర్యుడిని ఆరాధించడం చాలా ఫలప్రదం. దీనితో పాటు ఈ మాసంలో మానవులతో పాటు, పశు పక్ష్యాదుల దాహార్తిని తీర్చే జలదానం చేయాల్సి ఉంటుంది. ఈ మాసంలో దాహంతో ఉన్నవారికి నీరు ఇవ్వడం పుణ్యంగా భావిస్తారు.

జ్యేష్ఠ మాసంలో ఏమి చేస్తే మంచిది
మత విశ్వాసాల ప్రకారం, జ్యేష్ఠ మాసంలో, హనుమంతుడు శ్రీరాముడిని కలిశాడు. అందుకే హనుమంతుని ఆరాధన ఈ మాసంలో చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. దీనితో పాటు హనుమంతునికి తులసి దళాలతో పూజించడం మంచిదని భావిస్తారు.

జ్యేష్ఠ మంగళవారం ప్రాధాన్యత ఇదే…
జ్యేష్ఠ మంగళవారం హనుమంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ రోజున హనుమంతుడిని నిజమైన భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆయన కృప పొందుతారని నమ్ముతారు. కానీ జ్యేష్ఠ మాసంలో వచ్చే ప్రతి మంగళవారాన్ని మహా మంగళవారం అంటారు. అదే సమయంలో, ఈ నెలలో వచ్చే అన్ని మంగళవారాలు కూడా భక్తులకు చాలా ప్రత్యేకమైనవి.

రామాయణం ప్రకారం శ్రీరాముడు హనుమంతుడిని మొదటిసారిగా జ్యేష్ఠ మాసంలో మంగళవారం కలుసుకున్నాడు, అందుకే దీనిని మహా మంగళవారం అని పిలుస్తారు. ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసం 17 మే 2022 నుండి ప్రారంభమై జూన్ 14, 2022 వరకు ముగుస్తుంది. ఈ సంవత్సరం మే 17, మే 24, మే 31, జూన్ 7, జూన్ 14 తేదీల్లో మహా మంగళవారం రాబోతోంది. ఈ రోజు మీ సమీపంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామిని దర్శించుకోవడంతో పాటు, ఉపవాస దీక్ష చేస్తే శుభప్రదం.