Site icon HashtagU Telugu

Twin Banana: జంట అరటిపండ్లను తినకూడదా.. తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Twin Banana

Twin Banana

మామూలుగా అరటిపండును చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటూ ఉంటారు. అంతే కాకుండా ఈ అరటిపండు మనకు ఏడాది పొడవునా లభిస్తూ ఉంటుంది. అరటిపండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆరోగ్య పరంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. అరటిపండ్లను మనం ఎప్పుడైనా కొనుగోలు చేసినప్పుడు కొన్ని కొన్ని సార్లు జంట అరటి పండ్లు కూడా మనకు వస్తూ ఉంటాయి. అంటే ఒక అరటిపండుకి మరొక అటు అరటిపండు అతుక్కొని ఉంటుంది. దానినే జంట అరటి పండ్లు అని కూడా అంటారు.

చాలామంది ఈ జంట అరటి పండ్లను తినడం వల్ల కవల పిల్లలు జన్మిస్తారని అంటూ ఉంటారు. ఆ సంగతి పక్కన పెడితే.. నిజానికి ఆ జంట అరటిపండ్లను తినవచ్చా తినకూడదా అన్న అనుమానం చాలా మందికి కలుగుతూ ఉంటుంది. ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒకదానితో మరొకటి అతుక్కుపోయి వున్న కవల అరటిపళ్ళుగానీ ఉన్నాయా అని చూస్తాం. ఒకవేళ వుంటే ఆ కవల పండు వద్దని చెప్పి తీయించేస్తాం. కారణం? కవల అరటిపళ్ళను పిల్లలు తినకూడదు. పెద్దలు తింటే కవల పిల్లలు పుడతారు. కవల అరటి పళ్ళను దేవుడికి పెట్టకూడదు.

ఇలాంటి నమ్మకాలు మనకి వుంటాయి. అయితే చాలాసార్లు మనం కొన్న అరటిపళ్ళలో మనకి తెలియకుండానే కవల అరటిపళ్ళు వచ్చేస్తూ వుంటాయి. వాటిని పిల్లలకి పెట్టకుండా, దేవుడికి పెట్టకుండా పెద్దవాళ్ళే తింటూ ఉంటార. ఇంతకీ, కవల అరటిపళ్ళను పిల్లలకు పెట్టడం సంగతి అలా వుంచితే, కవల అరటిపళ్ళను దేవతలకు పెట్టకూడదా? అంటే.. అరటి చెట్టు అంటే మరెవరో కాదు. సాక్షాత్తూ దేవనర్తకి రంభ అవతారమే. శ్రీమహావిష్ణువు దగ్గర రంభ అందగత్తెనని అహంకార పూరితంగా వ్యవహరించడం వల్ల ఆమెను భూలోకంలో అరటిచెట్టుగా జన్మించమని మహావిష్ణువు శపించాడు. అయితే ఆమె తన తప్పు తెలుసుకుని ప్రాధేయపడటంతో దేవుడికి నైవేద్యంగా వుండే అర్హతను ఆయన ఇచ్చారు. అంత పవిత్రమైన పండులో మనం దోషాలను ఎంచాల్సిన అవసరం లేదు. కవల అరటిపళ్ళను నిరభ్యంతరంగా దేవతలకు అర్పించవచ్చు.

అయితే తాంబూలంలో మాత్రం జంట అరటి పళ్ళను పెట్టకూడదు. ఎందుకంటే కవల అరటిపండులో రెండు పళ్ళు ఉన్నప్పటికీ అది ఒక్క పండుకిందే లెక్కలోకి వస్తుంది. మరి తాంబూలంలో ఒక్కపండు పెట్టకూడదు. అలాగని రెండు కవల అరటిపళ్లు తాంబూలంలో పెట్టామంటే చాలా ఎబ్బెట్టుగా వుంటుంది. అందువల్ల తాంబూలంలో మాత్రం కవల అరటిపళ్ళను పెట్టకపొవడమే మంచింది.