Vastu Dosh: ఇంట్లో వాస్తు దోషాలకు అద్భుత పరిహారలు.. ఇవి పాటిస్తే ఇంట్లో అంతా మంచిదే!

భారతదేశం సంప్రదాయాలు, ఆచార్య వ్యవహారాలు, శాస్త్రాలకు పుట్టినిల్లు. వీటిలో భారతీయులు ఎక్కువగా వాస్తు

  • Written By:
  • Updated On - September 19, 2022 / 11:26 PM IST

భారతదేశం సంప్రదాయాలు, ఆచార్య వ్యవహారాలు, శాస్త్రాలకు పుట్టినిల్లు. వీటిలో భారతీయులు ఎక్కువగా వాస్తు శాస్త్రానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తారు. వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం వల్ల ఎలాంటి దోషాలు, సమస్యలు రావు అని విశ్వసిస్తూ ఉంటారు. ఒకవేళ ఇంట్లో వాస్తుదోషం ముంటే అందుకోసం ఎటువంటి పరిహారాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఇక వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తును ఉంచడమో లేదో తయారు చేయడం ద్వారా వాస్తు లోపం తొలుగుతుంది.

అంతేకాకుండా ఈ సంకేతం వల్ల ఇంట్లో అదృష్టం కలిసి వస్తుందట. అలాగే ఇంటి ప్రవేశ ద్వారా వద్ద సాయంత్రం సమయంలో క్రమం తప్పకుండా దీపాలను వెలిగించడం మర్చిపోవద్దు. అంతేకాకుండా వాస్తుదోషాన్ని తొలగించడానికి చెక్కతో తయారు చేసిన ప్రవేశ ద్వారాన్ని వాడాలి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద పొద్దుతిరుగుడు పువ్వు చిత్రాన్ని ఉంచండి. ఇది జీవితంలో ఆనందం, శ్రేయస్సును కలగజేస్తుందని విశ్వసిస్తారు. అలాగే ఇంట్లో సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుంది. ఇంటిలో నైరుతి మూలలో చికటి లేకుండా ఉండేలా చూసుకోవాలి.

అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం సాయంత్రం వేళలో వాయువ్య దిశలో వెలుతురు ఉండాలి. ఈ సమయంలో చీకటి ఉన్నట్లయితే ఇంట్లో ప్రతికూలత పెరుగుతుంది. సాయంత్రం వేల ఇక్కడ లైట్లు వెలిగించాలి. అలాగే ఎండిన చెట్లు లేదా మొక్కలను ఇంట్లో, బాల్కనీలో ఎప్పుడూ ఉంచకూడదు. ఇంటిని ఆకుపచ్చ చెట్లతో అలంకరించండి. పచ్చదనం ఇంటికి ఆనందం, శ్రేయస్సును తీసుకొస్తుంది. ఈ పరిహారాలను పాటించడం వల్ల ఇంట్లో సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు.