Site icon HashtagU Telugu

Vastu Tips: ఎంత సంపాదించినా డబ్బులు నిలవడం లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వండి?

Mixcollage 03 Mar 2024 08 55 Pm 8793

Mixcollage 03 Mar 2024 08 55 Pm 8793

ప్రస్తుతం రోజుల్లో చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా కూడా డబ్బులు చేతిలో మిగలకపోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తోందని అప్పుల భారంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే డబ్బులు చేతికి ఇవ్వాల్సిన వారు కూడా ఇవ్వకుండా సతాయిస్తున్నారని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు కూడా అలా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఇప్పుడు మేము చెప్పబోయే చిట్కాలను పాటిస్తే చాలు డబ్బుకు కొదవ ఉండదు. ధనం మూలమిదం జగత్ అంటారు. డబ్బు లేనిదే మన సమాజంలో ఏ పని కాదు. అందుకే మనుషులు డబ్బుకు అంత ప్రాధాన్యతని ఇస్తారు.

అయితే అటువంటి డబ్బు ఎంత కష్టపడినా కొంతమంది చేతిలో నిలబడదు. ఎప్పుడూ ఏదో ఒక ఆర్థిక ఇబ్బందులు వారిని వెంటాడుతూనే ఉంటాయి. మరి ఆ ఇబ్బందులు తొలగాలంటే వాస్తు నియమాలు పాటించాల్సిందే… ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఇంట్లో ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు. వారు సంతోషంగా ఉండలేరు. అయితే ఎంత కష్టపడినా ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో ఉంటున్నాయి అంటే అందుకు మనకు తెలిసి తెలియకుండా చేస్తున్న వాస్తు దోషాలే కారణం. కాబట్టి అటువంటివారు కొన్ని వాస్తు చిట్కాలను పాటిస్తే ఆర్థిక కష్టాల నుంచి, నష్టాల నుంచి బయటపడవచ్చు. ఇంట్లో కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

అయితే కుబేర యంత్రాన్ని ఈశాన్య దిశలోనే పెట్టుకోవాలని సూచించబడింది. ప్రతిరోజు కుబేర యంత్రాన్ని పూజించడం వల్ల, సంపదలకు అధిపతి అయిన కుబేరుడి అనుగ్రహం కలుగుతుంది. డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుందని, తద్వారా కుటుంబానికి సుఖ సంతోషాలు వస్తాయి. అలాగే పూజ గది ఆ దిశలో డబ్బుకు కొదవ ఉండదు అంతేకాదు ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అంటే తూర్పు వైపున ఈశాన్య దిశలో పూజ గది ఉంటే మంచిది అని సూచిస్తున్నారు. ఈశాన్య మూల పూజగది ఆర్థిక ఇబ్బందులను తొలగించి, లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణమవుతుందని చెబుతున్నారు. ఈశాన్య మూల పూజ గదిలో పూజలు చేస్తే సుఖ సంతోషాలు, సంపదలు వెల్లి విరుస్తాయి. బీరువా, లాకర్ల విషయంలో జాగ్రత్త ఇక ఇదే సమయంలో మనం ఇంట్లో డబ్బులు దాచి పెట్టే బీరువా విషయంలో, లాకర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అవి సరైన దిశలో లేకపోతే కూడా ధన నష్టం జరుగుతుందని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇస్తున్నారు. ఈ క్రమంలోనే నైరుతి దిశలో మాత్రమే బీరువాలు, లాకర్లు ఉంచుకోవాలని అప్పుడే డబ్బుకు కొదవ లేకుండా ఉంటుందని చెబుతున్నారు.

Exit mobile version