Site icon HashtagU Telugu

Dreams: తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయా.. ఇందులో నిజమెంత?

5 Things In Dreams

5 Things In Dreams

సాధారణంగా మనం నిద్రపోతున్న సమయంలో పగటి పూట లేదంటే రాత్రి సమయంలో కలలు రావడం అన్నది సహజం. ఎక్కువ శాతం రాత్రి సమయంలో చాలామందికి అనేక రకాల కలలు వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా తెల్లవారుజామున సమయంలో వచ్చే కలలు నిజమవుతాయి అని చాలామంది అంటూ ఉంటారు. మరి నిజంగానే తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయా. ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామూలుగా నిద్రను నాలుగు భాగాలుగా చెబుతూ ఉంటారు. అందులో మొదటి భాగంలో వచ్చిన కలలు ఏడాది తర్వాత చెడు ఫలితాలను ఇస్తాయి.

రెండవ భాగంలో వచ్చిన కలలు 6 నుంచి 12 నెలల్లో ఫలితాన్నిస్తాయి. ఇక మూడవ భాగంలో వచ్చిన కలలు 3 నుంచి 6 నెలల్లో ఫలితాన్నిస్తాయి. ఇక నాల్గవ భాగంలో వచ్చిన కలలు 1 నుంచి 3 నెలల్లో ఫలితాన్ని ఇస్తాయి. అయితే ఏదైనా కల సూర్యోదయం తర్వాత లేదా మేల్కొనే ముందు వచ్చినట్టైతే దాని ఫలితాన్ని సుమారు 10-15 రోజుల్లో ఉంటుందని అర్థం. కాగా చెడు కలలు అంటే ఏంటి అన్న విషయానికి వస్తే.. నెత్తి మీద పెట్టుకున్న కంచుపాత్రలు పగిలిపోవటం, క్షవరం చేయించుకున్నట్టు కనిపించటం, ఒంటికున్న వస్త్రాలు పోయినట్టుగా కనిపించటం, మలిన వస్త్రాలు ధరించటం, నూనె, బురద పూసుకోవటం, పైనుంచి కింద పడటం లాంటివి మంచిదికాదు.

పాములను చంపటం, ఎర్రటి పూలతో నిండిన వృక్షాలు, కుక్క, గాడిద, ఒంటె కనిపించటం, ఆ జంతువులపై ఎక్కినట్టుగా కనిపించడం శుభప్రదం కాదు. పక్షి మాంసాన్ని తినటం, తైలాన్ని తాగటం, మాతృ గర్భంలో ప్రవేశించటం, చితిపైకి ఎక్కటం, ఇంద్రధనస్సు విరిగినట్టుగా కనిపించటం ఇలా చాలా వాటిని చెడు కలలుగా భావిస్తారు. కాగా మంచి కలల విషయానికి వస్తే.. కలలో చేప‌లు క‌నిపిస్తే ఇంట్లో శుభ‌కార్యం జ‌రుగుతుంది. దెబ్బలు తింటున్న‌ట్లు క‌నిపిస్తే మీరు ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణులు అవుతార‌ు. కాళ్లు, చేతులు క‌డుగుతున్న‌ట్లు క‌ల‌ వస్తే అన్ని ర‌కాల స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. పాము క‌నిపిస్తే మీకు భ‌విష్య‌త్తులో అనుకున్న‌వి నెర‌వేరుతాయి. పెద్ద‌లు దీవిస్తున్న‌ట్లు, పాలు, నీళ్లు తాగుతున్నట్టు క‌నిపిస్తే మీకు స‌మాజంలో గౌర‌వ ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. క‌ల‌లో కుక్క మిమ్మ‌ల్ని క‌రిచిన‌ట్లు క‌నిపిస్తే త్వ‌ర‌లో క‌ష్టాలు ప్రారంభ‌మ‌వుతాయ‌ట‌. పెళ్లి అయిన‌ట్లు క‌ల‌వ‌స్తే మీకు ఇబ్బందులు ఎదుర‌వుతాయి. క‌ల‌లో అద్దం క‌నిపిస్తే మానసిక ఆందోళ‌నకు గుర‌వుతార‌ని అర్థం. రైలు ఎక్కుతున్న‌ట్లు క‌ల వ‌స్తే యాత్ర చేస్తార‌ని భావించాలి. ఇలాంటివన్నీ కూడా మంచి కలలుగా భావించాలి.