హిందూ మతంలో దసరా పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నవరాత్రులలో 9 రోజుల తర్వాత దసరా పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ దసరా పండుగ రోజున రంగురంగుల అందమైన పువ్వులతో అమ్మవారిని అలంకరిస్తూ పూజలు చేస్తూ ఉంటారు. ఇందుకోసం ఎన్నో రకాల పువ్వులను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా దసరా పండుగ రోజు శంఖు పుష్పాలతో పూజ చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. మరి శంఖు పుష్పంతో పూజ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శంఖు పువ్వులను శివుడి పూజలకు ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. అయితే దసరా రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో ఐదు అపరాజిత పువ్వులను కలిపి స్నానం చేయాలి. ఇది మీ అదృష్టాన్ని పెంచుతుందట. అలాగే దసరా రోజు పూజ సమయంలో లక్ష్మీదేవికి అపరాజిత పువ్వులను సమర్పించాలని చెబుతున్నారు. ఆ తర్వాత ఈ పువ్వులను సురక్షితమైన లేదా మీరు డబ్బుదాచే ప్రదేశంలో పెట్టాలట. ఈ పరిహారం వల్ల మీ పర్స్ ఎప్పుడూ ఖాళీగా ఉండదని చెబుతున్నారు. అలాగే దసరా రోజు ఈ శంఖు పువ్వులను చంద్రుడికి కూడా సమర్పించాలట. ఇది మీ జీవితంలో సంతోషాన్ని, శాంతిని పెంచుతుందని చెబుతున్నారు.
అదేవిదంగా దసరా రోజున ఇంటి ఈశాన్య మూలలో ఒక పాత్ర పెట్టి అందులో అపరాజిత పువ్వులను ఉంచాలట. ఇది మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఉంచుతుందట. అలాగే కుటుంబ గొడవలు, కొట్లాటల నుంచి కూడా విముక్తి పొందవచ్చని చెబుతున్నారు. అలాగే దసరా రోజు మీరు మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని ప్రతిష్టించినట్లయితే అక్కడ అపరాజిత పుష్పాలను ఉంచడం వల్ల అది మీకు ప్రత్యేక ప్రయోజనాలను కలిగిస్తుందని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుందట. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.