Site icon HashtagU Telugu

Dreams: నిద్రలో కలలు ఎన్ని రకాలు.. అసలు అవి ఎందుకు వస్తాయ్?

Dream Astrology

Dreams

సాధారణంగా మనం నిద్రపోయేటప్పుడు కలలు వస్తూ ఉంటాయి. ఇందులో కొన్ని భయంకరమైనవి, మరి కొన్ని సంతోషాన్ని కలిగించే కలలు వస్తూ ఉంటాయి. అయితే ఈ కలలలో కూడా మూడు రకాలు ఉన్నాయట. ఇప్పుడు మనం తెలుసుకుందాం.. స్వప్నశాస్త్రం ప్రకారం.. మనకు నిద్రలో వచ్చే కలలు మూడు రకాలు. అవి చింతజములు,వ్యాధిజములు, యాదృచ్ఛికములు. ఏదైనా విషయం గురించి పదేపదే ఆలోచిస్తే దానికి సంబంధించిన స్వప్నం వస్తుంది. అలాంటి వాటినే చింతజములు అంటారు. అలాగే జ్వరం లాంటి ఇతర రుగ్మతలకు గురైనప్పుడు మానసికంగా ఆందోళన కారణంగా కొన్ని కలలు వస్తుంటాయి.

వాటిని వ్యాధిజములు అని అంటారు. ఈ రెండు రకాల స్వప్నాలు భవిష్యత్తుకు సూచికలు కావు. మన ఆలోచనతో సంబంధం లేకుండా కాకతాళీయంగా వచ్చేవి యాదృచ్ఛికములు. అయితే వీటిలో కొన్ని భవిష్యత్తును సూచిస్తాయని స్వప్నశాస్త్రం చెబుతోంది. రాత్రి వేకువ జాములో అంటే అర్ధరాత్రి కన్నాముందే వచ్చే కలలు పాతిక శాతం, రెండో జాములో అనగా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వచ్చే కలలు 50 శాతం, మూడో జాములో అంటే తెల్లవారు జాము నుంచి తెల్లవారే లోపు వచ్చే కలలు 95 శాతం నిజమవుతాయని స్వప్నశాస్త్రం చెబుతోంది. అయితే ఈ సమయంలో వచ్చే కలలు అన్నీ నిజమవుతాయని శాస్ర్తాలలో ఎక్కడా పేర్కొనలేదు.

సుస్వప్నాలు: మేడలు, పర్వతాలు, ఫలవృక్షాలు, రథం, గుర్రాలు, ఏనుగులను చూడటం, వాటిని అధిరోహించడం. ఎద్దు, ఆవు, పూలు, గోక్షీరం, కన్య, రత్నాలు, ముత్యాలు, శంఖం, దేవతా విగ్రహాలు, చందనం, పుణ్యస్థలాలు చూసినా, పాలు, పెరుగు, తేనె, భక్ష్యాలు తిన్నట్టు కలవచ్చినా శ్రేష్ఠం. పట్టువస్ర్తాలు, ఆభరణాలు ధరించడం తదితర స్వప్నాలు కలలో కనిపిస్తే శుభఫలాల్ని ఇస్తాయని శాస్త్రం చెబుతోంది. దుస్వప్నాలు: పాములు వంటి విషజీవాలు, పులులు వంటి క్రూర మృగాలు, ఇనుము, పత్తి. కూలిన మేడలు చూసినా, ఇల్లు కూలినట్లు, బురదలో కూరుకుపోయినట్టు, మోదుగ చెట్టు ఎక్కినట్టు, నక్షత్రం పడిపోతున్నట్టు చూసినా, బావిలో పడినట్టు, పిచ్చివారు ఎదురుపడినా, శరీరానికి నూనె రాసుకున్నా, ఎవరో లాక్కొని పోయినట్టు కలలు వస్తే నష్టం వాటిల్లుతుందని శాస్త్రం చెబుతోంది.

Exit mobile version