Site icon HashtagU Telugu

Dreams: కలలో మాంసం కనిపించడం మంచిది కాదా.. అలా కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Blog1

Blog1

మామూలుగా నిద్రపోతున్నప్పుడు కలలు రావడం అన్నది సహజం. అందులో కొన్ని మంచి కలలు వస్తే మరి కొన్ని చెడ్డ కలలు మరికొన్ని పీడకలలు వస్తూ ఉంటాయి. చాలామంది కలలో కొన్నింటిని చూసినప్పుడు ఏం జరుగుతుందో ఏమవుతుందో అని టెన్షన్ పడుతూ ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే సాధారణంగా కలలో పక్షులు జంతువులు మనుషులు రకరకాల సంఘటనలు వస్తూ ఉంటాయి. అయితే మీకు కలలో ఎప్పుడైనా మాంసం కనిపించిందా. మరి అలా మాంసం కనిపించడం మంచిదా లేక చెడ్డదా పండితులు ఈ విషయం గురించి ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

స్వప్న శాస్త్రం ప్రకారం ఎవరికైనా కలలో మాంసాన్ని చూడడం అంటే అది వచ్చిన సందర్భాన్ని బట్టి, వచ్చిన పొజిషన్ ను బట్టి అదృష్టాన్ని, దురదృష్టాన్ని కలిగిస్తుంది. వండిన మాంసాన్ని కలలో చూస్తే అదృష్టం. ఇలా వండిన మాంసం కలలోకి వస్తే త్వరలో ఏదైనా పదోన్నతి లభిస్తుందని చెబుతున్నారు. ఇక పచ్చి మాంసాన్ని కలలో చూడడం అశుభంగా పరిగణించాలి. పచ్చి మాంసం కలలోకి వస్తే మీ జీవితంలో ఏదైనా చెడు జరగబోతోందని అర్థం. ఇక కలలో ఎప్పుడో వండిన మాంసాన్ని తిన్నట్టుగా వస్తే కొన్ని చెడు జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడుతాయి అని అర్థం చెబుతున్నారు.

అప్పుడే మాంసాన్ని వండుకొని తిన్నట్టుగా వస్తే మంచి జరుగుతుందని, జీవితంలో భవిష్యత్తులో ఏదైనా పురోగతి కనిపిస్తుందని అర్థం. అంతేకాదు కలలో మాంసాన్ని కోసినట్లుగా చూస్తే మీరు మరో వ్యక్తితో ఏదైనా విలువైన ఆస్తులను పంచుకునే అవకాశం ఉందని అర్థం. కుళ్ళిన మాంసం కలలో వస్తే అనారోగ్య సమస్యలు వస్తాయనడానికి సంకేతం. కోడి మాంసం తిన్నట్టు కల వస్తే మహిళలు శుభ వార్తలు వింటారని అర్థం. ఏది ఏమైనా కలలో మాంసం వస్తే అది వచ్చిన దాని బట్టి ఫలితం ఉంటుందని అంటున్నారు స్వప్న శాస్త్ర నిపుణులు.