మామూలుగా మనం పడుకున్నప్పుడు రకరకాల కలలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని మంచి కలలు అయితే మరికొన్ని పీడకలలు. అయితే వాస్తవానికి స్వప్న శాస్త్రంలో ప్రతి కలకి మంచి చెడుల అర్థం ఉంటుందని పేర్కొంది. ఇంకా చెప్పాలంటే కలలు రాబోయే భవిష్యత్తును సూచిస్తాయని అర్థం. కలలో వస్తువులు, జంతువులు, పక్షులు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చాలామందికి నిద్రపోతున్న సమయంలో కలలో పాములు కనిపిస్తాయి. అవి కూడా భిన్నంగా ఉంటాయి. పాము మిమ్మల్ని వెంబడించినట్లు, కాటు వేసి నట్లు, పాముకు పూజలు చేసినట్టు.. ఇలా రకరకాలుగా కలలు వస్తూ ఉంటాయి.
ఒకవేళ మీకు కలలో నలుపు లేదా తెలుపు రంగు పాము కనిపిస్తే ఏం జరుగుతుందో? ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కలలో నలుపు తెలుపు రంగులు పాములు కనిపించడం అన్నది వేరు వేరు సంకేతాలను సూచిస్తుంది. కలలో నల్లటి పామును చూడటం శుభప్రదంగా భావించవచ్చు. కలలో నల్లపాము మిమ్మల్ని వెంబడించడం లేదా కలలో నల్ల పాము ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్లు చూసినట్లయితే అటువంటి కల చాలా శుభప్రదంగా పరిగణింపబడుతుందని చెబుతున్నారు. ఇక కలలో నల్ల పాము కనిపించినట్లయితే.. భవిష్యత్తులో మీ ఇంట్లో శుభకార్యాలు జరగానున్నాయని అర్థం. అలాగే సంపదలో ఆకస్మిక పెరుగుదల ఉంటుందట.
అందుకే కలలో నల్లపాము కనిపించడం చాలా శుభప్రదమని చెబుతున్నారు. కలలో తెల్లటి పాము కనిపించడం అశుభం. కలలో తెల్లటి పాము మిమ్మల్ని వెంబడించడం లేదా ఇంట్లోకి తెల్ల పాము ప్రవేశించినట్లు కలలో కనిపిస్తే అది మీకు అశుభంగా భావించాలట. ఇలా నల్ల పాము కలలో చూడటం జీవితంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుందని చెబుతున్నారు. అయితే తెల్ల పామును చూడటం ఖచ్చితంగా జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందట.