Site icon HashtagU Telugu

Dream: కలలో మీకు ఇవి కనిపిస్తే చాలు.. కష్టాలన్నీ పరార్!

Mixcollage 13 Jul 2024 12 02 Pm 6047

Mixcollage 13 Jul 2024 12 02 Pm 6047

సాధారణంగా మనం నిద్రపోతున్నప్పుడు అనేక రకాల కలలు ఉంటూ వస్తూ ఉంటాయి. అయితే స్వప్న శాస్త్ర ప్రకారం మనకు వచ్చే ఒక్కొక్క కల ఒక్కొక్క విషయాన్ని సూచిస్తుందని చెప్పబడింది. భవిష్యత్తులో జరగబోయే విషయాలు మనకు ముందుగానే కలల రూపంలో వస్తాయని పండితులు కూడా చెబుతున్నారు. అయితే కలలో కొన్ని మంచి కలలు ఉంటే మరి కొన్ని చెడ్డ కలలు కూడా ఉంటాయి. కలలో మీకు కొన్ని కనిపిస్తే మీ కష్టాలన్నీ తీరతాయని ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు అని అంటున్నారు పండితులు. ఇంతకీ ఆ కలలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మీకు కలలో దేవుడు కనిపిస్తే తరువాత రోజు వెంటనే స్నానం చేసుకొని గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకోవాలి. పగటిపూట వచ్చిన కలలు ఫలించవని పండితులు చెబుతున్నారు. మద్యాహ్నం నిద్రపోయినప్పుడు వచ్చిన కలలు కూడా ఫలించవు. రోజంతా దేనిగురించైనా ఆలోచిస్తే అవి కలలో వస్తే ఆ కలలు కూడా ఫలించవని చెబుతున్నారు. మీకు కలలో ఏనుగు మీద ఎక్కినట్లు, తెల్లని గుర్రం మీద ఎక్కినట్లు, తెల్లని ఎద్దుమీద ఎక్కినట్లు కల వస్తే గొప్ప స్థాయిని చేరుకోబోతున్నారని అర్థం. వారు ఉన్న స్థానంలో నుంచి మరింత మెరుగైన స్థానంలోకి వెళ్తారని అర్థం.

కలలో తెల్లని హంసలు, కోళ్లు, చకోర పక్షలు కనబడితే తొందరలోనే వివాహ జరుగుతుందని అర్థం. సముద్రం దగ్గర, చెరువు దగ్గర తామరాకు మీద కూర్చొని పాయసం తాగుతున్నట్లు గనుక కల వస్తే వారికి త్వరలోనే అఖండ రాజయోగం దక్కుతుందని అర్థం. ఏదో ఒక విధంగా వీరికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. జీవితంలో తరతరాలుగా కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వారికీ లభిస్తుందని అర్థం. విడిపోయిన భార్య భర్తల్లో ఎవరికైనా ఒకరికి ఇద్దరూ కలిసి ఒకే కంచంలో తింటున్నట్లు కలవచ్చినా, భర్త తొడమీద భార్య కూర్చున్నట్లు కలవచ్చినా ఇద్దరూ త్వరలోనే కలుసుకోబోతున్నారని అర్థం.

కలలో గులాబీలు, ఎర్రని పుష్పాలు, తామర పువ్వులు గనుక కనిపిస్తే తొందరలోనే ఇంట్లో మహాలక్ష్మీ కాలు పెట్టబోతోందని అర్థం. మీకు వున్న అన్ని ఆర్థిక సమస్యలు తీరిపోతాయని అర్థం. ఇక కలలో దేవతలు గనుక కనిపిస్తే ఇక నక్కతోక తొక్కినట్లేనని పండితులు చెబుతున్నారు. కలలో ఏ దేవుడు కనిపిస్తే ఆ దేవాలయానికి మరుసటి రోజు స్నానం చేసుకొని వెళ్లి ఆ దేవుడికి నమస్కరించి దేవాలయంలో అర్చన చేయించాలని పండితులు చెబుతున్నారు.