మామూలుగా మన నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. కలలో మనుషులు పక్షులు జంతువులు వాతావరణం ఇలా ఏవేవో కనిపిస్తూ ఉంటాయి. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. అయితే మామూలుగా కలలు భవిష్యత్తును సూచిస్తాయని చెబుతూ ఉంటారు. ఇకపోతే మీకు కలలో ఆలయం కనిపించిందా. మరి కలలో ఆలయం కనిపిస్తే అది దేనికి సంకేతం. కలలో ఆలయం కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..స్వప్న శాస్త్రం ప్రకారం, మీకు కలలో దేవాలయం కనిపిస్తే, అది శుభసూచకంగా పరిగణించాలి.
అలాంటి కల రావడం వల్ల చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మీ పని త్వరగా పూర్తవుతాయని అర్థం. అలాగే మీ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. మీకు కలలో దేవాలయం కనిపిస్తే, మరుసటి రోజు ఆలయానికి వెళ్లి అక్కడ పూజలు చేసి, దానం చేయాలి. ఇలా చేస్తే మీ కోరికలు కూడా నెరవేరుతాయి. మీకు కలలో పురాతన దేవాలయం కనిపిస్తే భయపడాల్సిన పనిలేదు. కలలో పురాతన ఆలయాన్ని చూడటం మంచిదే. అటువంటి కలలు మీ పాత స్నేహితుడు అకస్మాత్తుగా మీ ముందు కనిపిస్తారని సూచిస్తాయి. ఆ స్నేహితుడిని కలవడం ద్వారా మీరు అదృష్టవంతులు అవుతారు.
మీరు చేపట్టిన అనేక పనులు అతని సహాయంతో పూర్తి చేస్తారు. అదేవిధంగా స్వప్న శాస్త్రం ప్రకారం మీరు దేవాలయంలో పూజలు చేస్తున్నట్లు కనిపిస్తే అది శుభసూచకంగా పరిగణించాలి. మీరు ఎన్ని కష్టాల్లో కూరుకుపోయి ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు, భగవంతుని దయతో మీకు త్వరలోనే ఊహించని మంచి జరుగుతుందని ఈ కల సంకేతం. కలలో గంటను మోగించడం లేదా గంటను చూడడం లేదా గంట శబ్దం వినడం శుభ సంకేతంగా పరిగణించాలి. ఈ కల చేస్తున్న ప్రయత్నాల్లో విజయానికి సూచిక. త్వరలో మీకు శుభవార్త అందుతుందని అర్థం. మీరు ఏ పని కోసం ప్రయత్నిస్తారో, ఆ పనిలో మీరు గొప్ప విజయాన్ని పొందుతారు.