Site icon HashtagU Telugu

Dream: మీకు కూడా కలలో అలాంటివి కనిపించాయా.. అయితే మీ దశతిరిగినట్టే?

Mixcollage 22 Jan 2024 02 35 Pm 6349

Mixcollage 22 Jan 2024 02 35 Pm 6349

మామూలుగా మనం పడుకునే సమయంలో ఎన్నో రకాల కలలు పీడకలలు భయంకరమైన కలలు వస్తూ ఉంటాయి. అయితే అందులో కొన్ని ఉదయం సమయంలో వచ్చే కలలు నిజమవుతాయని పండితులు చెబుతూ ఉంటారు. కొంతమంది పీడ కలలు భయంకరమైన కలలు వచ్చినప్పుడు పదేపదే వాటిని తలుచుకుంటూ భయపడుతూ ఉంటారు. ఇంకొందరు మాత్రం ఎలాంటి కలలు వచ్చినా కూడా కలలు వచ్చినా కూడా లైట్ తీసుకుంటూ ఉంటారు. అయితే కలలో మనకు నిజ జీవితంలో జరిగిన సంఘటనలు కానీ జరగబోయే సంఘటనలు గానీ, పక్షులు జంతువులు, మనుషులు ఇలా చాలా రకాల ప్రాణులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కలలో మనకు కనిపించే కొన్ని రకాల సంకేతాలు అదృష్టం వరించబోతుందని సంకేతాలుగా భావించాలి.

మరి కలలో ఎలాంటివి కనిపిస్తే అదృష్టం మారుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కలలో కనిపించే ఎన్నో విషయాలు మన భవిష్యత్తు గురించి చెబుతాయి. భవిష్యతుల్లో మనం ఎదుర్కొనే సంఘటనలను సూచిస్తాయి. మన కలలలో కనిపించే సంఘటనలు మనకు జరిగే శుభ లేదా అశుభ సంకేతాలను సూచిస్తాయి. అసలు ఎలాంటి కలలు పడితే మంచిది? ఎలాంటి కలలు పెడితే చెడ్డదో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని కలలు పడితే అంతా మంచే జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. ఇలాంటి కొన్ని కలల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మీరు కలలో పాలు మరుగుతున్న దృశ్యాన్ని చూస్తే భవిష్యత్తులో ఏదో ఒక శుభకార్యం జరగొచ్చని అర్థం. ఒక వ్యక్తి కెరీర్లో పురోగతిని పొందబోతున్నాడని అర్థం.

అలాగే ఈ కల ఆగిపోయిన మీ పనులు పూర్తి కాబోతున్నాయని సూచిస్తుంది. హిందూ మతంలో శంఖాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే దీన్ని లక్ష్మీదేవి నివాసంగా భావిస్తారు. అందుకే మీరు కలలో శంఖాన్ని చూసినట్టైతే మీకు ఏదో శుభం జరుగుతుందని అర్థం. డ్రీమ్ సైన్స్ ప్రకార కలలో శంఖం కనిపించడం చాలా అరుదైన కలగా భావిస్తారు. ఈ కల పడిందంటే మీరు లక్ష్మీదేవి, విష్ణువు అనుగ్రహం పొందినట్టే. మీ కలలో నాణెం కనిపించడం శుభ సంకేతం. ఈ కల మీరు త్వరలో సంపదను పొందబోతున్నాడని సూచిస్తుంది. అలాగే మీరు కలలో బంగారాన్ని చూస్తే.. అది ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి చిహ్నం. ఇలాంటి కలలను డ్రీమ్ సైన్స్ దృష్ట్యా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.