Sri Rama Navami: శ్రీ రామ నవమి రోజున చేయవలసినవి.. చేయకూడనివి..

చైత్ర నవరాత్రి చివరి రోజు శ్రీరామునికి అంకితం చేయబడింది. ఆ రోజున (మార్చి 30) శ్రీ రామ నవమి జరుపుకుంటారు. చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిదో రోజున

చైత్ర నవరాత్రి చివరి రోజు శ్రీరామునికి అంకితం చేయబడింది. ఆ రోజున (మార్చి 30) శ్రీ రామ నవమి (Sri Rama Navami) జరుపుకుంటారు. చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిదో రోజున పుష్య నక్షత్రంలో పూర్ణిమ రోజున శ్రీ రాముడు అవతరించినందున.. శ్రీరాముని భక్తులు సాధారణంగా ఈ కార్యక్రమానికి చాలా రోజుల ముందు నుంచే సన్నాహాలు చేస్తారు. భగవంతుడు రాముని ప్రస్తావన భక్తులకు అతని అనంతమైన సద్గుణాలను గుర్తుకు తెచ్చేటట్లు చేస్తుంది. మరికొందరు శ్రీరాముడి గొప్ప వ్యక్తిత్వాన్ని చూసి పులకించిపోతారు. ఏ రామ భక్తుడికైనా ఇది చాలా ప్రత్యేకమైన రోజు. రామ నవమి రోజున ​​ఎలాంటి కార్యకలాపాలు సూచించబడ్డాయి.. ఆ రోజున ఏయే కార్యకలాపాలు నిషేధించ బడ్డాయో ఇప్పుడు తెలుసుకుందాం..

చేయవలసిన పనులు..

  1. చాలా ప్రాంతాల్లో రాముడి విగ్రహాన్ని ఊయలలో ఉంచుతారు.
  2. ఉపవాసం ఆచరించడం వల్ల మీకు సుఖం, శ్రేయస్సు కలుగుతాయి. పాపాలు నశిస్తాయి.
  3. మీరు లేచిన వెంటనే దేవునికి అర్ఘ్యం సమర్పించండి.
  4. అయోధ్యలోని సరయూ నదిలో పవిత్ర స్నానం చేయడం వలన మీ గత మరియు ప్రస్తుత జన్మల పాపాలు తొలగిపోతాయి.
  5. రామచరిత్ మానస్, రామ్ చాలీసా , శ్రీరామ రక్షా స్తోత్రాన్ని త్రికరణ శుద్ధిగా పఠించాలి.
  6. ఈ రోజున రామ కీర్తనలు, భజనలు, స్తోత్రాలు పఠిస్తారు.
  7. మీ భక్తి ఎంత ఎక్కువగా ఉంటే అంత ఫలితాలు వస్తాయి.
  8. హనుమాన్ చాలీసా పఠించండి.
  9. నిరుపేదలకు దానం చేయండి..
  10. రాముడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి, ఈ సమయంలో రామ నవమి పూజ చేయడం అత్యంత అనుకూలమైనది.
  11. ఈ రోజున అర్చనలు, నిర్దిష్ట పూజలు చేయవచ్చు. వీటన్నింటిని ఏకకాలంలో నామ జపం, మంత్రాలు, శ్లోక పఠనంతో అనుసరించాలి.
  12. దశమి తిథి వరకు మొత్తం తొమ్మిది రోజులు అఖండ జ్యోతిని వెలిగించండి.. మీకు అసౌకర్యంగా అనిపిస్తే, పండుగ పూర్తయ్యే వరకు ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం దీపాలు వెలిగించండి.
  13. ఉపవాసం ఉన్నప్పుడు చాలా నీరు తాగండి. అంతటా హైడ్రేటెడ్ గా ఉండాలి. నిమ్మ నీరు, లేత కొబ్బరి, మజ్జిగ, గ్రీన్ టీ వంటి వాటిని తీసుకోండి.
  14. మీరు ఎక్కడైనా పని చేస్తుంటే.. మీ ఆకలిని కవర్ చేసుకోవడానికి వాల్‌నట్‌లు, బాదం పప్పులను తినండి. ప్రోటీన్ స్మూతీలు తీసుకోవచ్చు.
  15. ఈరోజు ఎవరినీ మోసం చేయకూడదని లేదా మోసగించకూడదని గుర్తుంచుకోండి.

చేయకూడని పనులు..

  1. తామసిక ఆహారాలు, మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉండండి.
  2. ఉల్లిపాయలు, వెల్లుల్లి జోడించకుండా మీరు కూరలను తీసుకోవచ్చు.
  3. నవరాత్రి వేళ జుట్టు కత్తిరించుకోకూడదు. ఈ పండుగ సమయంలో షేవింగ్ కూడా నిషేధించబడింది.
  4. ఇతరులను విమర్శించవద్దు లేదా ఇతరుల గురించి చెడుగా మాట్లాడకండి. మాట, ఆలోచన లేదా చేత ఇతరులను బాధించవద్దు.

స్త్రోత్రాలు

ఓం శ్రీ రామయ: నమ:
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
ఓం దశరథయే విద్మహే సీతావల్లభయ ధిమాహీ తనో రామ ప్రచోదాయత్

అనే స్త్రోత్రాలు చదివి రాముని కృపకు పాత్రులు కాగలరని పురాణాలు చెబుతున్నాయి.

ఇదీ నేపథ్యం..

అయోధ్యకు రాజు దశరథుడికి ముగ్గురు భార్యలు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. బాధ అంతా సంతానం గురించే. వశిష్ట మహాముని దశరథ రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్నినిర్వహించే బాధ్యతను అప్పజెప్పాలని కోరాడు. దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్లి తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్య యైన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్రకు ఇచ్చారు. కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు. చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి రోజున.. మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మను ఇచ్చింది. కైకేయి భరతుడికీ, సుమిత్ర లక్ష్మణ శతృఘ్నూలకు జన్మనిచ్చారు. అందుకే చైత్ర మాసం తొమ్మిదో రోజున శ్రీ రామ నవమి (Sri Rama Navami) జరుపుకుంటారు.

Also Read:  Shakti Ganapati: ఈ ఆలయానికి వెళ్లాలనుకుంటే స్వామి పిలిస్తేనే వెళ్లగలరు