Site icon HashtagU Telugu

Astrology : చేతిలో డబ్బులు నిలవడంలేదా..? అయితే నవరాత్రులలో ఈ మొక్కను నాటండి..!!

Goddess Lakshmi Kanakadhara Stotram

Goddess Lakshmi Kanakadhara Stotram

లక్ష్మీ దేవి ఇంట్లో స్థిరంగా ఉండటం చాలా కష్టం. లక్ష్మీ దేవి ఏ ఇంట్లో అయితే స్థిరంగా ఉంటుందో…ఆ ఇంట్లో డబ్బు, ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. అయితే కొన్ని నియమాలను పాటించినట్లయితే లక్మీదేవిని ఇంట్లో శాశ్వతంగా ఉంచుకోవచ్చు. ఎంత డబ్బు సంపాదించిన చివరికి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఇలా వచ్చి అలా ఖర్చవుతుంటే ఎంతో బాధగా ఉంటుంది. నవరాత్రులలో లక్ష్మీ దేవి అనుగ్రహం పొందడానికి మీరు కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తే అంతా మంచి జరుగుతుంది.

1. నవరాత్రులలో ఏ రోజైనా మీ ఇంట్లో నాగకేసర మొక్కను నాటండి. ఇది లక్ష్మీదేవికి చాలా ఆకర్షణీయమైన మొక్క. ఈ మొక్కను నాటితే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి ఐశ్వర్యం పొందేందుకు కొత్త మార్గాలు దొరుకుతాయి.

2. డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంటే… నవరాత్రులలో రెండు అత్తి పండ్లను తెచ్చి, వాటిని అమ్మవారి పాదాల వద్ద ఉంచండి. ఆపై ఎర్రటి గుడ్డలో చుట్టండి..ఇలా చేస్తే డబ్బు ఆదాయ వనరుగా కొనసాగుతుంది.

3. నవరాత్రులలో అశ్వత్థ వృక్షంపై తెల్లటి జెండాను ఎగురవేయడం వల్ల ఊహించని సంపద వస్తుంది.

4. నవరాత్రి అష్టమి నాడు దుర్గాదేవికి తామరపువ్వును సమర్పించి, ఎర్రటి గుడ్డలో చుట్టి, ఆమె పాదాలపై ఉంచండి. దీని తరువాత, దానిపై కుంకుమ చల్లండి. ఇలా చేస్తే మీకు ఎప్పటికీ డబ్బు కొరత ఉండదు.

5. నవరాత్రుల సందర్భంగా తొమ్మిది మంది ఆడపిల్లలకు భోజనం పెట్టండి. సౌందర్య సాధనాలను కానుకగా ఇవ్వండి. ఇలా చేయడం వల్ల డబ్బుకు లోటు ఉండదు.

6. ఉద్యోగం రావడం లేదని బాధపడుతున్నారా అయితే నవరాత్రులలో ప్రతిరోజూ అశ్వథ్ చెట్టు మూలానికి పచ్చి పాలు పోయండి. అలాగే సాయంత్రం వేళలో అమ్మవారి ముందు నెయ్యి దీపం వెలిగించాలి.

7. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తొలగించడం ద్వారా మీరు మీ డబ్బు సంక్షోభం నుంచి బయటపడతారు. దీని కోసం, నవరాత్రులలో ఏ రోజున అయినా సరే ప్రధాన ద్వారం వద్ద నిమ్మకాయ మిరపకాయలను వేలాడదీయండి.

8. నవరాత్రులలో హనుమంతుడి కి బూందీ లడ్డులను సమర్పించండి…మీ కోరికలు నెరవేరుతాయి.
9. అశ్వత్థ ఆకుపై కుంకుమతో ‘శ్రీ’ అని వ్రాసి, దానిని అమ్మవారికి సమర్పించిన తర్వాత, అష్టమి రోజున మీ బీరువాలో భద్రపరుచుకోండి.