Tulasi : ఈ రోజు తులసి ఆకులు ముట్టుకోవద్దు..నీళ్లు పోయకండి..ఎందుకో తెలుసా..?

  • Written By:
  • Publish Date - November 4, 2022 / 08:32 AM IST

ఇవాళ దేవుత్తని ఏకాదశి. ప్రతిఏటా కార్తీక మాసం శుక్లపక్షంలోని ఏకాదశి తిథినాడు ఈ ఏకాదశి వస్తుంది. ఈరోజు విష్ణుమూర్తి యోగా నిద్ర నుంచి మేల్కొంటాడని పురాణాలు చెబుతున్నాయి. తులసి మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైంది. తులసి లేకుండా విష్ణుమూర్తి ఆరాధన అసంపూర్ణంగా ఉంటుంది. ఆదివారం, ఏకాదశి తిథిలలో తులసిని తాకరాదు. ఆకులు తెంపరాదు. నీరు పోయకూడదు. ఇలా చేస్తే అశుభం అని పండితులు చెబుతున్నారు. దీని వెనకున్న అసలు కారణం ఏంటో తెలుసుకుందాం.

దేవుత్తని ఏకాదశి నవంబర్ 4, 2022 న వస్తుంది. అంటే ఇవాళే. ఈ రోజు విష్ణుమూర్తి నాలుగు నెలల నిద్రలోనుంచి మేల్కొంటాడు. దేవుత్తని ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేసి శంఖం, గంట ఊదుతూ మేల్కోలుపుతారు. దేవుత్తాని ఏకాదశి మరుసటి రోజు తులసి వివాహం నిర్వహిస్తారు. ఆ తర్వాత అన్ని శుభకార్యాలు ప్రారంభం అవుతాయి.

ఈ ఏకాదశికి తులసి ఎంతో విశిష్టత ఉంది. తులసి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైంది. తులసి లేకుండా విష్ణుపూజ నిర్వహించరు.తులసీని లక్ష్మీదేవిగా నమ్ముతారు. తులసి మొక్క నాటిన ఇంట్లో లక్ష్మీదేవి కొలువైందని భావిస్తారు. వాస్తు ప్రకారం ప్రతి ఇంట్లో తులసికి నీరు పోసి పూజిస్తారు. అయితే కొన్ని రోజుల్లో తులసికి నీరు పోయడం నిషిద్దం. ఆదివారం, ఏకాదశి రోజు నీరు పోయకూడదు. ఈరోజుల్లో తులసికి నైవేద్యం పెడితే నాశం అవుతుందని పురాణాలు చెబతున్నాయి.

హిందువులు అన్ని రకాల మతపరమైన, శుభకార్యాలకు తులసిని ఉపయోగిస్తారు. తులసి మొక్కకు ప్రతిరోజూ నీరు పోస్తుంటారు. అయితే, ఆదివారాల్లో తులసికి నీరు పోయకూడదు. ఎందుకంటే, తులసి దేవి ఆదివారం నాడు శ్రీమహావిష్ణువు కోసం ఉపవాసం ఉంటుంది. ఈ రోజున మీరు ఆమెకు నీటిని సమర్పిస్తే, ఆమె ఉపవాసం భంగంవాటిల్లుతుందని నమ్ముతుంటారు.

ఆదివారం నాడు తులసి నీరు సమర్పిస్తే, ప్రతికూల శక్తులు మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి. జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. ఇలా చేస్తే లక్ష్మీదేవి కూడా కోపానికి గురవుతుంది. ఆదివారం నాడు తులసి మొక్కను తాకడం, ఆకులను తెంపడం నిషేదం.

మత విశ్వాసాల ప్రకారం, ఏకాదశి రోజున తులసి దేవిని విష్ణు స్వరూపమైన శాలిగ్రామంతో వివాహం చేసుకున్నట్లు చెబుతారు. నిజానికి, దేవ్ ఉథాని ఏకాదశి రోజున ఇద్దరూ అన్ని ఆచారాలతో వివాహం చేసుకున్నారు. తులసి దేవి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటుందని ..ఈ రోజున మీరు నీటిని సమర్పిస్తే, ఆమె ఉపవాసం భంగం అవుతుందని కూడా నమ్ముతుంటారు. అందుకే ఈ రోజు తులసి ఆకులను తెంపడం నీరు పోయడం మానుకోండి.