Site icon HashtagU Telugu

Shani Dosha: ఈ వస్తువులు ఎవరైనా ఇస్తే అస్సలు తీసుకోకండి…శనీశ్వరున్ని ఆహ్వానించినట్లే..!!!

sesame-oil

sesame-oil

మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం. కొన్ని తెలిసి చేస్తే…మరికొన్ని తెలియకుండానే చేస్తుంటాం. కొన్ని సందర్భాల్లో మనం చేసిన తప్పులు ఎన్నో సమస్యలకు కారణం అవుతాయి. ఎంతో కష్టపడిన సంపాదించిన ఆస్తులు కూడా కోల్పోయే సందర్భం కూడా వస్తుంది. కానీ మనం కష్టపడి సంపాదించిన సంపదను కాపాడుకునేందుకు శాస్త్రాలలో ఎన్నో నియమాలు ఉన్నాయి. అయితే కొన్ని వస్తువులు ఉచితంగా వస్తున్నాయని వాటిని తీసుకునే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే అలాంటి వస్తువులు మనల్ని పేదరికంలోకి నెట్టేసే ప్రమాదం ఉంటుంది. ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం.

1. ఉప్పు:
మన పెద్దలు చెబుతుంటారు ఉప్పును చేతికి ఇవ్వకూడదని…అలాగే సంధ్యాసమయంలో ఉప్పును ఇంట్లో నుంచి బయటకు ఇవ్వకూడదని. అంతేకాదు ఉప్పును ఎవరికీ అప్పుగా కూడా ఇవ్వరాదు…ఇచ్చినా తీసుకోకూడదని. ఒకరి నుంచి ఉప్పును తీసుకుంటే…డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. డబ్బులకు బదులుగా మరేదైనా వస్తువును ఇవ్వొచ్చు. కానీ ఉప్పును ఫ్రీగా తీసుకోవడం మంచిది కాదు. ఉప్పును వేరొకరి నుంచి ఉచితంగా తీసుకున్నట్లయితే శనీశ్వరున్ని ఇంట్లోకి ఆహ్వానించినట్లే అవుతుంది.

2. ఆవాల నూనె:
కొంతమంది ఇరుగుపొరుగువారి నుంచి కొన్ని వస్తువులు బదలుగా తీసుకుంటుంటారు. కానీ ఆవాల నూనె మాత్రం ఎవరి దగ్గర నుంచి ఉచితంగా తీసుకోకూడదు. శాస్త్రం ప్రకారం ఆవాల నూనె శనీశ్వరునికి సంబంధించినది. ఆవాల నూనె ఉచితంగా తీసుకుంటే…మీ జీవితంలో శనిదోషాన్ని కలిగిస్తుంది. అంతేకాదు వ్యక్తుల మధ్య సంబంధాల్లో విబేధాలకు కారణం అవుతుంది.

3. సూది దారం:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మీరు మరొకరి నుండి సూది దారం అప్పుగా తీసుకోకూడదు. లేదంటే అప్పుగా కూడా ఇవ్వకూడదు. ఇలా ఇవ్వడం ద్వారా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. సూది దారం ఉచితంగా తీసుకుంటే మీ కుటుంబ సంబంధాలలో విభేదాలకు కారణం అవుతుంది. ఇది మీ కుటుంబంలో మానసిక స్థితిని దెబ్బతీస్తుంది. అంతేకాదు కుటుంబ సభ్యుల మధ్య శత్రుత్వం పెరిగే అవకాశం ఉంటుంది.

శాస్త్రాల ప్రకారం, పైన పేర్కొన్న మూడు వస్తువులను ఇతరుల నుంచి ఉచితంగా తీసుకున్నా లేదా ఇచ్చినా…మీరు శనీశ్వరున్ని ఆహ్వానించినట్లే అవుతుంది.