Site icon HashtagU Telugu

Vasthu Tips: పొరపాటున కూడా ఈ వస్తువులను కాలితో అస్సలు తాకకండి.. తాకారో ఆర్థిక ఊబిలో కూరుకుపోవడం ఖాయం!

Vasthu Tips

Vasthu Tips

మాములుగా మనం అనేక రకాల విషయాలను పాటిస్తూ ఉంటాం. అందులో పెద్దలు చెప్పిన విషయాలను ఇప్పటికీ చాలామంది తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నారు. అటువంటి వాటిలో ఎవరికైనా కానీ వస్తువులకు కానీ మనుషులకు కానీ కాళ్లు తగిలినప్పుడు వెంటనే కళ్ళకు అద్దుకుంటూ ఉంటాము. అందుకు గల కారణం దేవుళ్ళు, దేవతల చిహ్నాలుగా ఆ వస్తువులను పరిగణించడమే. జంతువులు, పక్షులలో, అలాగే కొన్ని రకాల వస్తువులలో దేవతలు నివసిస్తున్నారని నమ్ముతారు. ఈ జంతువులు, పక్షులు లేదా వస్తువులను పొరపాటున కూడా కాలితో తాకరాదు. ఇలా కాలితో తాకడం అంటే దేవుళ్ళను అగౌరవపరిచినట్లే అని చెబుతుంటారు. ఇది పాప కర్మగా భావిస్తారు. అంతేకాదు ఇలాంటి కర్మలకు శిక్ష మరణానంతర అనుభవించాల్సి ఉంటుందట. అయితే మరి వాస్తు శాస్త్రం ప్రకారం పొరపాటున కూడా ఏ వస్తువులను కాలితో తాకరాదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆవు.. హిందువులు ఆవును దేవతగా పూజిస్తూ ఉంటారు. గోమాతలో సకల దేవతలు నివసిస్తారని నమ్మకం. అలా దైవంగా భావించే ఆవుని పొరపాటున కూడా కాలితో తన్నరాదు. ఆవుపై ఎప్పుడూ కాలు వేయకూడదట. ఆవుని కాలితో తాకడం వలన తెలివితేటలు నశిస్తాయట. జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చని చెబుతున్నారు.

అదేవిధంగా ఇత్తడి, రాగి లోహం సూర్య భగవానుడిని సూచిస్తుందట. సూర్యుడికి ఈ రాగి లేదా ఇత్తడి పాత్రలతో నీరుతో అర్ఘ్యం ఇస్తారు. కాబట్టి ఈ లోహంతో చేసిన పాత్రలను కాలితో తన్నరాదట. ఇలా చేయడం వలన జాతకంలో చంద్రుడు బలహీనంగా మారవచ్చని చెబుతున్నారు. అలాగే జీవితంలో అనేక రకాల సమస్యలు తలెత్తడం ప్రారంభం అవుతాయట.

శంఖం.. భూమి అలాగే భూమి మీద నివసించే సమస్త జీవులు కూడా పవిత్రమైనది. ఎందుకంటే హిందూ మతంలో భూమిని తల్లిగా భావిస్తారు. శంఖం కనుక మీ ఉంటే దానిని ఎప్పుడూ పాదాలతో తాకకూడదు. లక్ష్మీ దేవి శంఖంలో నివసిస్తుంది. శంఖం మీద కాలు వేయడం వల్ల మీ పాదం తెగిపోవడమే కాకుండా అది ఆర్థిక నష్టానికి కూడా దారితీయవచ్చని చెబుతున్నారు.

చీపురు.. చీపురును లక్ష్మీదేవి చిహ్నాలలో ఒకటిగా కూడా బావిస్తారు. అందుకే చీపురిని ఎప్పుడూ పాదాలతో తాకకూడట. చీపురు పేదరికాన్ని తొలగిస్తుందట. ఎందుకంటే లక్ష్మీదేవి అందులో నివసిస్తుందని చెబుతున్నారు.

ఆహారం, పానీయం.. అదేవిధంగా ఆహార పదార్ధాన్ని కాలుతో తాకడం నిషేధించబడింది. ఎటువంటి ఆహరాన్ని అయినా సరే కాలితో తాకరాదట. అంతేకాదు పూజా వస్తువులను లేదా పూజలో ఉపయోగించే వస్తువులను పొరపాటున కూడా తన పాదాలతో తాకకూడదని చెబుతున్నారు. ఇలా చేయడం వలన జీవితంలో అనేక సమస్యలు వస్తాయట.

తులసి దళాలు.. తులసి మొక్కకు కూడా హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తులసి దళాలు కూడా లక్ష్మి నివాసంగా భావిస్తారు. కాబట్టి తులసి దళాలను ఎప్పుడూ పాదాలతో తాకకూడదట ఇలా చేయడం వలన ఆర్ధిక ఇబ్బందులు కలగవచ్చని చెబుతున్నారు. దీనితో పాటు జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కోవలసి రావచ్చట. అలాగే మన ఇంటి గడపను కూడా కాలితో తన్నకూడదట. ఇలా చేస్తే లక్ష్మి దేవికి కోపం వస్తుందని చెబుతున్నారు.