Site icon HashtagU Telugu

Vasthu Tips: ఇంట్లో దక్షిణ దిశలో అలాంటి వస్తువులను పెట్టారా.. అంటే అయితే వెంటనే తీసేయండి?

Mixcollage 29 Jan 2024 08 05 Pm 6365

Mixcollage 29 Jan 2024 08 05 Pm 6365

హిందువులు వాస్తు విషయాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం గా జరగాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాగే చాలామంది ఇంట్లో వస్తువుల అమరిక విషయంలో కూడా వాస్తు విషయాలను పాటిస్తూ ఉంటారు. ఇక వాస్తు శాస్త్రంలో దక్షిణ దిశను యమ దిశగా పరిగణిస్తారు. దక్షిణ దిశను భూమి మూలకం ఆధిపత్యం చేసే దిశగా పరిగణిస్తారు. కాబట్టి దక్షిణ దిశ విషయంలో జాగ్రత్త అవసరం. దక్షిణ దిశలో కొన్ని రకాల వస్తువులను అస్సలు ఉంచకూడదు. అ చాలామంది దక్షిణం దిశవైపు ఉన్న ఇంటిని శుభ ప్రదంగా పరిగణించరు అయితే ఇల్లు దక్షిణం దిశ వైపు ఉంటే, ఆగ్నేయదిశలో ప్రధాన ద్వారం ఉంటే బాగా తీవ్రమైన ఇబ్బందులు ఉండవు.

దక్షిణదిశ ఇల్లు కాకుండా ఉంటేనే మంచిది. కానీ ఒకవేళ ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వాస్తు ప్రకారం దక్షిణం దిశలో బరువైన వస్తువులను పెట్టాలి. దక్షిణం దిశలో బరువైన వస్తువులను పెట్టడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. దక్షిణం దిశ విషయంలో తీసుకోవాల్సిన మరొక జాగ్రత్త దక్షిణం వైపు పొరపాటున కూడా కాళ్లు పెట్టి పడుకోకూడదు. అలా పడుకుంటే ఆరోగ్య హాని కలుగుతుంది. ఇంటికి దక్షిణ దిశలో ఫీనిక్స్ పక్షి చిత్రాన్ని ఉంచినట్లయితే అది సానుకూలతలను ఆకర్షిస్తుంది.

వాస్తు ప్రకారం దక్షిణం దిశలో పూర్వీకుల చిత్రాలను ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దక్షిణ దిశ పూర్వీకుల కోసం కేటాయించిన దిశ కావడంతో ఈ దిశలో పూర్వీకుల చిత్రాలను ఉంచడం మంచిది. దక్షిణం వైపు యంత్రాలను, ఎలక్ట్రానిక్ వస్తువులను ఉంచడం మంచిది కాదు. దక్షిణ దిశలో బూట్లు, చెప్పులు పెట్టడం వల్ల పితృ దోషం తలెత్తుతుంది. పితృ దోషం కలిగితే తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. పూజ స్థలాన్ని వంటగదిని దక్షిణ దిశలో పొరపాటున కూడా నిర్మించకూడదు. ఇక దక్షిణ దిశ విషయంలో ఈ నియమాలను పాటిస్తే ఆర్థిక నష్టాల నుంచి కష్టాల నుంచి గట్టెక్కుతాము.

Exit mobile version