హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్ళలో పరమేశ్వరుడు కూడా ఒకరు. శివుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. అయితే వారంలో సోమవారం రోజు పరమేశ్వరుడికి అంత్యంత ప్రీతికరం. సోమవారం శివుడికి అంకితం చేయబడింది. ఈరోజున శివుడికి పూజలు చేయడంతో పాటు ప్రత్యేకంగా ఆరాధించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. అయితే పరమేశ్వరుడిని పూజించడం మంచిదే కానీ తెలిసి తెలియకుండా కూడా ఆయన పూజలు కొన్ని రకాల పొరపాట్లు అస్సలు చేయకూడదని చెబుతున్నారు. ఇంతకీ ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చాలామందికి సోమవారం ఉపవాసం ఉండడం అలవాటు. ఉపవాస సమయంలో పరమేశ్వరుడికి చాలా రకాల వస్తువులు సమర్పిస్తూ ఉంటారు. అయితే ఉపవాసం చేసేవారు తెలిసి తెలియకుండా కూడా కొన్ని రకాల పొరపాట్లు అస్సలు చేయకూడదని చెబుతున్నారు. మనం తెలిసి తెలియక చేసే పొరపాట్లు పరమేశ్వరుడికి కోపం తెప్పించవచ్చట. పరమేశ్వరుడికి మామూలుగా పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉంటారు. అనగా పాలు పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో అభిషేకం చేస్తూ ఉంటారు.
అయితే చాలామంది అభిషేకం చేసేటప్పుడు రాగి పాత్రలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ అభిషేకం సమయంలో పూజ సమయంలో రాగి పాత్రలు అసలు ఉపయోగించకూడదట. ఎందుకంటే వీటిలో ఉండే రసాయనాల వల్ల పాలు, పెరుగు వంటివి అందులో పోయేగానే విరిగిపోతాయట. అలా చూసుకోకుండా విరిగిన పాలతో అభిషేకం చేస్తే పాపం వస్తుందట. అభిషేకం చేయడం కోసం స్టీల్ ఇత్తడి వెండి పాత్రలను మాత్రమే ఉపయోగించాలని పండితులు చెబుతున్నారు. కాబట్టి పైన చెప్పిన తప్పులను అస్సలు చేయకండి. శివయ్య అనుగ్రహం కావాలి అనుకున్న వారు మనస్ఫూర్తిగా భక్తితో ఓం నమః శ్శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ మారేడు దళాలు సమర్పించి నీటితో అభిషేకం చేస్తే ఆ శివయ్య అనుగ్రహం తప్పక కలుగుతుందట.