Site icon HashtagU Telugu

Solar Eclipse 2023 : నేడు సూర్యగ్రహణం రోజు ఈ తప్పులు చేశారో జీవితాంతం కన్నీళ్లు పెట్టుకోవడం ఖాయం..

Solar Eclipse 2024

solar eclipse

నేడు ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం (Solar Eclipse 2023 )ఏర్పడనుంది. భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీని కారణంగా సూర్యుడు పూర్తిగా చీకటిగా మారిపోతాడు. ఈసారి సూర్యగ్రహణం మేషరాశిలో ఏర్పడబోతోంది. ఇది చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే 19 ఏళ్ల తర్వాత మేషరాశిలో సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఈసారి సూర్యగ్రహణం హైబ్రిడ్‌గా ఉంటుంది.

ఈసారి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదని, చైనా, అమెరికా, మైక్రోనేషియా, మలేషియా, ఫిజీ, జపాన్, సమోవా, సోలమన్, బరూని, సింగపూర్, థాయ్‌లాండ్, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దక్షిణ పసిఫిక్ మహాసముద్రాలలో కనిపించనుంది.  వియత్నాం, తైవాన్, పాపువా న్యూ గినియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, దక్షిణ హిందూ మహాసముద్రంలో కనిపిస్తాయి. కాబట్టి సూర్యగ్రహణం శాస్త్రీయ ప్రాముఖ్యత ఏమిటి, ఈ సమయంలో తినడం, త్రాగటం ఎందుకు నిషేధించబడుతుందో తెలుసుకుందాం. సూర్యగ్రహణం సమయంలో ఏమి చేయకూడదు, ఏమి చేయాలి.పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సూర్యగ్రహణం సమయంలో తినడం, త్రాగడం ఎందుకు నిషేధం:
మత గ్రంధాల ప్రకారం సూర్యగ్రహణం సమయంలో ఏమీ తినకూడదు. మరోవైపు, స్కందపురాణంలో, సూర్యగ్రహణం సమయంలో ఆహారం తినడం ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని పేర్కొంది. సూర్యగ్రహణ సమయంలో భోజనం చేయడం వల్ల అన్ని పుణ్యాలు, కర్మలు నశిస్తాయని శాస్త్రం చెబుతోంది.

సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయకండి:
-గ్రహణ సమయంలో ఒంటరిగా ఏ ఒక్క ప్రదేశానికి లేదా దహన సంస్కారాలకు ఒంటరిగా వెళ్లకండి. ఎందుకంటే ఈ సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
-మరోవైపు, జ్యోతిష్యశాస్త్రంలో, గ్రహణం సమయంలో నిద్రపోకూడదు, సూదిలో దారం కూడా వేయకూడదు.
-గ్రహణ సమయంలో ప్రయాణం మానుకోండి.

గ్రహణం సమయంలో ఈ పనులు చేయండి:
1. సూర్యగ్రహణం తర్వాత, గంగాజలంతో స్నానం చేసి, గంగాజలాన్ని ఇల్లంతా చల్లండి.
2. గ్రహణాంతరం స్నానం చేయండి.
3. గ్రహణ సమయంలో పచ్చళ్లు, ఆహార పదార్థాలపై గరక వేయండి.
4. గ్రహణ సమయంలో హనుమంతుడిని పూజించండి.
5. గ్రహణం విడిచిన తర్వాత దేవుళ్లను శుభ్రం చేసి దీపారాధన చేయండి.