Site icon HashtagU Telugu

Daily Pooja : నిత్యపూజలో ఈ పొరపాట్లు చేయకండి. ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. !!

God Photos

God Photos

హిందూమతంలో చాలామంది తమ ఇళ్లలో ప్రతిరోజూ దేవుడిని పూజిస్తుంటారు. పూజలు, ఉపవాసాలు, ఆచారాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. దేవుడిని పూజించడం వల్ల దేవునిపై నమ్మకం, గౌరవం, విశ్వాసాన్ని చూపుతుంది. ఒక వ్యక్తి భగవంతుడిని ఆరాధిస్తే…అతను ప్రాపంచిక భ్రమలను మరచి ఆధ్యాత్మిక ప్రపంచానికి చేరుకుంటాడు. మనస్సుకు శాంతి, సంత్రుప్తిని ఇస్తుంది. కానీ సరైన నియమాలు, నిబంధనలతో చేసినప్పుడే పూజకు ఫలితం లభిస్తుంది.

మనందరం దేవుడిని పూజిస్తాము. మనం కోరిన కొన్ని కోరికలు నెరవేరవు. నిజానికి పూజసమయంలో తెలిసి తెలియక చేసే పొరపాట్ల వల్లే ఇదంతా జరుగుతుంది. అందుకే మనకు పూజ ఫలితం లభించదు. పూజ సమయంలో ఎలాంటి విషయాలు గుర్తుంచుకోవాలి. ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం.

పూజ చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి:
1. నిలబడి పూజచేయవద్దు :
నిలబడి పూజ చేయవద్దు, నేలపై కూర్చొని పూజించవద్దు. పూజ చేసే ముందు ఒక మ్యాట్ ను నేలపై పరచి, ఆసనంపై కూర్చొని మాత్రమే పూజ చేయాలి.

2. తల కప్పుకోండి:
తలపై కొంగు కప్పుకోకుండా పూజ చేయకండి. ఇలా పూజిస్తే ఫలితం ఉండదు. పూజ సమయంలో తలపై కప్పుకోవడం భగవంతుని పట్ల భక్తిని తెలియజేస్తుంది. ఆరాధన సమయంలో తలపై కప్పడానికి మతపరమైన శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. అందుకే పూజ సమయంలో స్త్రీలు లేదా పురుషులు తమ తలను గుడ్డతో కప్పుకోవాలి.

3. విగ్రహాలను మీ కంటే ఎత్తులో ఉంచండి:
పూజా స్థలం ఇంటి నేలపై కొంచెం ఎత్తులో ఉండాలి. మీ శారీరక ఎత్తుతో సమానంగా పూజించకూడదు. ఆరాధన కోసం దేవుళ్లను ఒక పీఠంపై లేదా భూమి కంటే ఎత్తులో ఉంచాలి.

4.పూజించే దిశ:
పూజ చేసేటప్పుడు, మీ ముఖం తూర్పు వైపు ఉండాలి. పూజ సమయంలో వెలిగించిన నెయ్యి దీపాన్ని ఎడమ వైపున ఉంచాలి. అంటే పూజ చేసేటప్పుడు మీ ముఖం తూర్పు వైపు ఉండాలి. దేవుడిని పూజించేటప్పుడు ప్రతిరోజూ ఈ నియమాలను పాటించాలి.