Donate: మీ ఇంటికి వచ్చిన వారికి అవి ఇచ్చారంటే మీరు అప్పుల పాలవ్వడం ఖాయం?

మామూలుగా పండుగ సమయాలలో లేదంటే మామూలు రోజుల్లో బిక్షగాళ్లు ఇంటింటికి కూడా వచ్చి అన్నం పెట్టమని డబ్బు సహాయం చేయమని అడుగుతూ ఉంటారు. అ

  • Written By:
  • Publish Date - January 2, 2024 / 06:30 PM IST

మామూలుగా పండుగ సమయాలలో లేదంటే మామూలు రోజుల్లో బిక్షగాళ్లు ఇంటింటికి కూడా వచ్చి అన్నం పెట్టమని డబ్బు సహాయం చేయమని అడుగుతూ ఉంటారు. అయితే అటువంటి సమయంలో కొంతమంది వస్తువుల రూపంలో మరికొందరు డబ్బు రూపంలో మరికొందరు ఆహారం రూపంలో ఎవరికి తోచిన విధంగా వారు దానం చేస్తూ ఉంటారు. అలా దానం చేయడం మంచిదే కానీ ఇంటికి వచ్చిన వారికి ఒక్కటి ఇస్తే మాత్రం మీరు అప్పుల్లో కూరుకుపోవడం ఖాయం అంటున్నారు పండితులు. మరి ఆ ఒక్కటి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బ్రాహ్మణులకు చాలామంది దక్షిణ ఇస్తూ ఉంటారు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మీరు దాని ఫలితాన్ని పొందాలంటే మీరు పేద బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. వారికి నష్టం కానివి ఏవైనా సరే మీరు దానం చేసినట్లయితే మీకు శుభ ఫలితం కలుగుతుంది. మీరు ఆ పుణ్యఫలితాన్ని పొందుకుంటారు. వారికి ఇష్టమైనది నష్టం కానిది మీరు దానం చేస్తేనే మీకు పుణ్యం కలుగుతుంది. అలాగే వారికి ఏదైనా మీకు అవసరం లేని వస్తువులు అలాగే వారికి ఇబ్బంది కలిగించే వస్తువులు కానీ పదార్థాలు కాని దానం చేసిన కానీ మీరు పుణ్యానికి బదులుగా పాపాన్ని పొందాల్సి వస్తుంది. కాబట్టి దానధర్మాలు చేసేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం చాలా అవసరం.

ఆకలి అన్నవారికి అన్నం, దప్పిక అన్నవారికి నీరు మాత్రమే కాక చేయి చాచిన వారికి సిరిసంపదలను దానం చేసిన సందర్భాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. దానం చేయడం వల్ల దాతకు కీర్తి పుణ్యం అందుతాయి. మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఎల్లప్పుడూ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవి ఏమిటంటే.. ఒకటి ఉక్కు వస్తువులు లేదా పాత్రలు దారిలో లేదా ఎక్కడైనా దొరికిన ఇనుప రాగి వంటి లోహం వస్తువులను ఇంటికి తీసుకుని రాకూడదని వాటిని ఉపయోగించకూడదు. అది మాత్రమే కాదు ఇలాంటి వస్తువులను దానం చేయడం వల్ల అభివృద్ధి క్షిణిస్తుంది. లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుందని ఆరోగ్యానికి మంచిది కాదు. చాలామంది దానం చేయడం వల్ల మీ కుటుంబానికి ఆటంకం కలుగుతుంది.

ఇలా చేయడం వల్ల వ్యాపారాలకు నష్టం జీవనోపాధికి లోటు ఏర్పడతాయని కాబట్టి చిరిగిన వస్తువులను దానం చేయవద్దు. కొబ్బరినూనె కొందరు ఇతరులకు దానం చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో వారికి మీ కుటుంబ సభ్యులకు తప్ప బయట వారికి కొబ్బరి నూనె దానమిస్తే ఇస్తే కనుక మీ ఇంట్లో డబ్బు నిలువ ఉండకుండా పోతుంది. జీవితాంతం మీరు దరిద్రాన్ని అనుభవిస్తారు. కాబట్టి దానం చేసేటప్పుడు ఎలాంటి వస్తువులు దానం చేయాలి ఇలాంటి వస్తువులను దానం చేయకూడదు అన్న విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. లేదంటే మీరు దానం చేసిన ఫలితం దక్కకపోగా లేనిపోని కష్టాలను కొని తెచ్చుకున్నట్టే అవుతుంది..