Site icon HashtagU Telugu

Friday Tips : పొరపాటును కూడా శుక్రవారం రోజు ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి.. చేశారో అంతే సంగతులు..!

Don't Even Make A Mistake On Friday.

Don't Even Make A Mistake On Friday.

Tips to follow on Friday : శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. ధనానికి అధిదేవత అయిన లక్ష్మీదేవిని శుక్రవారం ప్రత్యేకంగా పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేర్చడంతో పాటు అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అందుకే శుక్ర‌వారం లక్ష్మీ దేవిని పూజించడమే కాకుండా, ఉపవాసం కూడా పాటిస్తారు. లక్ష్మీదేవిని పూజించి, శుక్రవారాల్లో (Friday) ఉపవాసం ఉండే వ్యక్తికి జీవితంలో ధన, ధాన్యాల‌కు కొరత ఉండదు. అయితే శుక్రవారాల్లో కొన్ని పనులు చేయకూడదని శాస్త్రం చెబుతోంది. కొన్ని రకాల పొరపాట్లు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికాక తప్పదు అంటున్నారు. మరి శుక్రవారం (Friday) రోజు ఎటువంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

లక్ష్మీదేవిని సంపదలకు అధి దేవతగా భావిస్తారు. అలాంటప్పుడు, శుక్రవారం లక్ష్మీదేవికి సంబంధించిన కాబ‌ట్టి మనం డబ్బు లావాదేవీలు చేస్తే అంటే అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం లాంటివి చేయడం వల్ల లక్ష్మి దేవికి మనపై కోపం వస్తుంది. ఆమె కోపం వల్ల మనం జీవితాంతం ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. శుక్రవారం నాడు మాంసం, మద్యం వంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఎందుకంటే, మాంసాన్ని తామసిక ఆహారంగా పరిగణిస్తే, మద్యాన్ని మత్తుగా పరిగణిస్తారు. ఈ రెండింటిని సేవించడం వల్ల మన మనస్సును పూజలో ఏకాగ్రతగా ఉంచుకోలేము. అందుకే ఈ రోజు మనం సాత్విక ఆహారాలు మాత్రమే తీసుకోవాలి. శుక్రవారం నాడు మాంసం, మద్యం సేవించడం వల్ల కుటుంబ సమస్యలు పెరుగుతాయి.
శుక్రవారం శాంతి దినం.

ఈ రోజు మనం ఎంత ప్రశాంతంగా ఉంటామో, ఎంత మంచి ఆలోచనలు చేస్తే లక్ష్మీదేవి మనకు అంత దగ్గరవుతుంది. మీరు లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం నాడు ఎవరినీ అవమానించకూడదు. అలాగే ఎవరి గురించి చెడు ఆలోచనలు పెట్టుకోకూడదు. లక్ష్మీ దేవికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం. వాటిలో చక్కెర ఒకటి. ఈ కారణంగా శుక్రవారం ఎవరికీ పంచదార ఇవ్వకూడదు. శుక్రవారము పంచదార ఇవ్వడం వలన జాతకంలో శుక్రుని స్థానం బలహీనపడుతుంది. బలహీనమైన శుక్రుని స్థానం కారణంగా ఒక వ్యక్తి తన జీవితంలో పేదరికాన్ని అనుభవిస్తాడు. అతని ఆనందం, శ్రేయస్సు నాశనం అవుతుంది. అలాగే లక్ష్మి పరిశుభ్రతను ఇష్టపడే దేవత. దుమ్ము, ధూళి ఉన్న ప్రదేశంలో ఆమె ఉండదు. శుక్రవారం నాడు తెల్లవారుజామున లేచి కాల‌కృత్యాలు పూర్తి చేసుకున్న‌ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడవడానికి ఉపయోగించే నీటిలో చిటికెడు రాళ్ల ఉప్పు వేసి శుభ్రం చేయాలి. ఇలా చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా వీటన్నిటి విషయంలో జాగ్రత్తలు పాటించడం వల్ల లక్ష్మి అనుగ్రహం తప్పక కలుగుతుంది.

Also Read:  Chanakya Neeti : మనిషిని పేదవాడిగా మార్చే అలవాట్లు