Meal: అన్నం తినేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి?

సాధారణంగా భోజనం చేసేటప్పుడు చాలా మంది తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది. ఈ మధ్

  • Written By:
  • Publish Date - June 14, 2023 / 09:00 PM IST

సాధారణంగా భోజనం చేసేటప్పుడు చాలా మంది తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది కుదురుగా కింద కూర్చొని తినడం మానేశారు. డైనింగ్ టేబుల్ పై, కుర్చీలపై,మంచాల పై,సోఫాలపై కూర్చొని తినడం అలవాటు చేసుకున్నారు. ఇలా తినడం ఏ మాత్రం మంచిది కాదు అంటున్నారు పండితులు. చక్కగా నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆధ్యాత్మికంగా కూడా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి.

అయితే మరి అన్నం తినేటప్పుడు చేయకూడనివి, మార్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అన్నం తినేటప్పుడు చాలామంది ప్లేట్ చుట్టూ అన్నాన్ని ఒలకబోస్తూ తింటూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. అన్నం తినేటప్పుడు ప్లేట్ చుట్టూ పడకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ కిందపడినా వెంటనే తీసేయాలి. కిందపడ్డ తుకులను ఎవరూ తొక్కకుండా శుభ్రం చేయాలి. అన్నం తినేటప్పుడు ఎప్పుడూ కూడా మాట్లాడకుండా ఆహారాన్ని ముగించాలి. కానీ చాలామందికి ఉండే అతి పెద్ద చెడ్డ అలవాటు భోజనం చేసేటప్పుడు మాట్లాడుతూ ఉంటారు.

ఆహారాన్ని ముగించిన తరువాత చేతులను ప్లేట్ లో కడగకూడదు. చేతులు బయట కడుక్కోవాలి. తిన్న ప్లేట్లో చేతులు కడగకూడదు, ప్లేట్ ఎండిపోకూడదు. చేతులు కడిగినా, తిన్న ప్లేట్ ఎండినా దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే ఆహారం ముగించి నిద్రపోయే ముందు గిన్నెలు శుభ్రం చేయడమో లేదంటే అవి ఎండిపోకుండా నీళ్లు పోయడం చేయాలి. అలాగే అన్నం తిని చేతులు కడుక్కున్న తర్వాత చాలామంది వేళ్లను విదిలిస్తూ ఉంటారు. అలా చేయకూడదు. అన్నం తినేటప్పుడు మధ్యలో దగ్గు లేదా తుమ్ము వస్తే అక్కడే ఉమ్మేయడం, దగ్గేయడం చేయరాదు. పొలమారితే అక్కడి నుంచి లేచి వెళ్లి చేతులు కడుక్కుని వచ్చి భోజనం చేయాలి. ఇది పరమదరిద్రం కూర్చుని మాత్రమే భోజనం చేయాలి ఎప్పుడూ కూడా నిలబడి తినకూడదు. తిన్నాక చేతులు విదిలించకూడదు. కడుక్కున్న చేతుల్ని శుభ్రంగా తుడుచుకోవాలి. భోజనం పూర్తైన తర్వాత పుల్లలు, వేళ్లు నోట్లో పెట్టుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. అది అస్సలు మంచిది కాదు. నీళ్లను పుక్కిలించి ఉమ్మేయడం మంచిది. భోజనం పూర్తైన తర్వాత ఒళ్లంతా బరువుగా ఉందంటూ తిన్నప్లేట్ పక్కనే నడుం వాలుస్తారు. అది పరమ దరిద్రానికి హేతువు. తిన్న ప్లేట్ అక్కడే ఉంచి ఎప్పుడూ ఆ పక్కనే నిద్రపోరాదు. తిన్న ప్లేట్లను శుభ్రం చేసి ఆ తర్వాత అన్నం మెతుకులను శుభ్రం చేయాలి.