Site icon HashtagU Telugu

Sunday: పొరపాటున కూడా ఆదివారం రోజు ఈ పనులు అస్సలు చేయకండి?

Mixcollage 02 Jul 2024 07 55 Am 8505

Mixcollage 02 Jul 2024 07 55 Am 8505

వారంలో మిగతా రోజులతో పాటుగా ఆదివారం రోజు కూడా తెలిసి తెలియకుండా చాలా మంది కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఆదివారం రోజు పొరపాటున కూడా కొన్ని రకాల తప్పులు చేయకూడదు అంటున్నారు పండితులు. మరి ఆదివారం రోజు ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మద్యం సేవించడం, మాంసం తినడం, వెంట్రుకలు కత్తిరించడం, తలకు నూనె పట్టించుకోవడం, స్త్రీలతో స్నాంగత్యం లాంటి వాటిని ఆదివారం నిషేధించడం జరిగింది. అయితే ఆదివారం రోజు ఈ పనులన్నీ చేసిన వాడు జన్మజన్మలకు దరిద్రుడు అవుతాడు అని చెబుతున్నారు పండితులు.

కానీ ప్రస్తుత రోజుల్లో ఆదివారం అంటే ఒక సెలవు దినంగా మారిపోయింది. ఇంటిల్లిపాది అందరూ ఇంట్లోనే ఉండడం వల్ల ఉదయం పూట కాస్త ఆలస్యంగా నిద్రలేచి చికెన్ మటన్ చేపలు వంటి మాంసాహార పదార్థాలు ఎక్కువగా తెచ్చుకుని తింటూ ఉంటారు. ఆదివారాన్ని వీకెండ్ పేరుతో ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్రం పాలు చేశారు, చేస్తున్నాము. మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు, ఎన్ని ఆచారాలు, సంస్కృతులు భిన్నంగా ఉన్న మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వాన్ని తెలిపేది మన హైందవ సంస్కృతి. అది చూసి తట్టుకోలేక బ్రిటీషు వాడు ఈ నీచుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు.

మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు. ఆదివారం నాడు చర్చిలు కలకలలాడతాయి. మన హిందూ దేవాలయాలు వెలవెల బోతాయి. పూర్వకాలంలో వృత్తి పనులు చేసుకునే వారు అమావాస్యను సెలవు దినంగా పాటించేవారు. ఇప్పటికీ కొన్ని దుకాణాల వారు అమావాస్య నాడు తెరువరు. ఒకప్పుడు హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించే వారు. ఆ రోజు జీవహింస చేసి మాంసాన్ని తినేవారు కాదు. మధ్యాన్ని తాగేవారు కాదు. కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయ్యింది. ఆదివారం వస్తే సెలవు దినం కదా అని మద్యాహ్నం 12 గంటల దాకా పడుకునే వారున్నారు. కాబట్టి ఇకమీదటమైన అలా అస్సలు చేయకండి. ఒకేసారి అన్నీ మార్పులు సాధ్యపడకపోవచ్చు కానీ క్రమ క్రమముగా ఒక్కొక్కటి మార్చుకుంటూ పోతే కొన్ని సంవత్సరాలకు అన్నీ మార్పులు చేసుకోవచ్చు ఆదివారం సెలవు ఉండటం అనేది అతి పెద్ద కారణం కావచ్చును.

Exit mobile version