Friday: శుక్రవారం రోజు అలాంటి పనులు అస్సలు చేయకండి.. చేశారో అంతే సంగతులు?

శుక్రవారం రోజు లక్ష్మిదేవిని ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆ రోజున అమ్మవారి

  • Written By:
  • Publish Date - January 30, 2024 / 04:15 PM IST

శుక్రవారం రోజు లక్ష్మిదేవిని ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆ రోజున అమ్మవారిని భక్తిశ్రద్ధలతో విశేష పూజలు చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా మహిళలు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎన్నో రకాల పరిహారాలు పాటించడంతోపాటు పూజలు కూడా చేస్తూ ఉంటారు. అయితే లక్ష్మీ అనుగ్రహం కలగాలి అని కోరుకునే వారు శుక్రవారం రోజున పొరపాటున కూడా కొన్ని రకాల పనులు అస్సలు చేయకూడదు. చేసారంటే దరిద్రం పట్టిపీడించడం ఖాయం. మరి శుక్రవారం రోజు ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయానికి వస్తే..

శుక్రవారం నాడు డబ్బులు ఎవరికీ ఇవ్వకూడదు. శుక్రవారం అనవసరపు ఖర్చులు పెట్టకూడదు. శుక్రవారం నాడు వెలుగుతున్న దీపాన్ని ఆర్పకూడదు. అలాగే శుక్రవారం నాడు తినే ఆహారాన్ని తినకుండా పక్కకు నెట్టొద్దు. తోడబుట్టిన వారి మనసులను సరదాగా కూడా కష్టపెట్టకూడదు. ఉదయం వేళ, సాయంత్రం సమయంలో నిద్ర పోకూడదు. మహిళలు ఇళ్లలో బూజు దులపడం, ఇల్లు క్లీన్ చేయడం లాంటివి చేయకూడదు. పాత సామాన్లను, పాత బట్టలను శుక్రవారం నాడు ఎవరికీ దానమివ్వకూడదు. ఇలా చేస్తే ఇంట్లో సంపద వెళ్ళిపోతుంది. శుక్రవారం రోజు పొరబాటున కూడా పసుపు, కుంకుమలను కింద పడేయకూడదు. అంతేకాదు శుక్రవారం నాడు చేతికి ఉన్న గాజులు తీయకూడదు.

శుక్రవారం నాడు పువ్వులు క్రింద పడెయ్యకూడదు. శుక్రవారం నాడు ఎవరినీ కఠినంగా తిట్టకూడదు. మందిరాలలో ఎండిపోయిన పువ్వులను కానీ, ఇంటి గుమ్మాలకు, దర్వాజా లకు పెట్టిన పువ్వులను కానీ శుక్రవారం నాడు తీసిపారేయకూడదు. లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించే ఈ పనులు చేస్తే జీవితంలో విపరీతమైన కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. శుక్రవారం నాడు మహిళలు ఎప్పుడూ కంటతడి పెట్టకూడదు. కుటుంబ సభ్యులను గానీ, ఎవరిని గానీ తిట్టకూడదు. శుక్రవారం నాడు ఇంట్లోని ముఖ్యమైన ఆహార పదార్థమైన బియ్యాన్ని ఖాళీ చెయ్యకూడదు. ఉప్పు, పసుపు ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు. శుక్రవారం రోజు మహిళలు అబద్ధాలు చెప్పకూడదు. ఈ విషయాలలో జాగ్రత్తలు పాటిస్తే , శుక్రవారం చెయ్యకూడని పనులు చెయ్యకుండా ఉంటే లక్ష్మీ దేవి కటాక్షం తప్పక కలుగుతుంది.