Shani Dev: పొరపాటున కూడా శనివారం రోజు ఈ వస్తువులు కొనకూడదు, తీసుకోకూడదు.. అవేంటో తెలుసా?

నవగ్రహాల్లో ఒకరైన శనీశ్వరుని గురించి మనందరికీ తెలిసిందే. శనీశ్వరుడు పేరు వినగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. చాలామంది శని దేవుని ఆలయాలకు వెళ

  • Written By:
  • Publish Date - June 18, 2023 / 10:20 PM IST

నవగ్రహాల్లో ఒకరైన శనీశ్వరుని గురించి మనందరికీ తెలిసిందే. శనీశ్వరుడు పేరు వినగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. చాలామంది శని దేవుని ఆలయాలకు వెళ్లాలి అన్న శని దేవుని పూజించాలి అన్న భయపడుతూ ఉంటారు. గ్రహాల సంచారం ఆధారంగా ఒక్కొక్కరిపై శనిప్రభావం ఒక్కోలా ఉంటుంది. కానీ కేవలం శని నడుస్తున్నప్పుడే కాదు నిత్యం మనం చేసే కొన్ని పనుల వల్ల కూడా ఆ ప్రభావం పడుతుంది. మరీ ముఖ్యంగా శనివారం రోజున శనిదేవుడిని అర్చించడం మంచిదే కానీ ఆ రోజు కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం కానీ చేతికి అందుకోవడం లాంటివి చేయకూడదు.

శనివారం ఇనుముతో తయారైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా వ్యాపారులు నష్టపోతారట. అలాగే నువ్వుల నూనె,నువ్వులను కొనుగోలు చేయకూడదు. అదేవిధంగా ఎవరి చేతి నుంచీ కూడా అందుకోకూడదు. అలా చేస్తే శనీశ్వరున్నీ ఇంటికి ఆహ్వానించినట్లే. ఎందుకంటే నువ్వులు శనికి ఇష్టం కాబట్టి వాటిని చేతికందుకున్నా, కొన్నా శనిని తీసుకొచ్చినట్టే. అలాగే శనివారం రోజున ఆవాలతో చేసిన వంటలు కానీ, ఆవు నూనె కాని వాడకూడదు. శనివారం నల్లని దుస్తులు, నలుపు గాజులు, నలుపు రంగు బూట్లు కొనరాదు.

ధరించరాదు. ఈ రోజున శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి, నువ్వులను సమర్పించి, నల్లని వస్త్రాన్ని మాలగా అలంకరించి పూజించడం ద్వారా అష్ట దరిద్రాలు తొలగిపోయి సుఖశాంతులు, సిరి సంపదలు కలుగుతాయి. శనివారం ఆవాలు కొన్నా, ఎవరినైనా అడిగి తెచ్చుకున్నా ఎన్ని ఆవాలున్నాయో అన్ని సమస్యలు చుట్టుముడతాయి. ఉప్పు, మిరియాలు, వంకాయలు కూడా కొనకూడదు, ఎవ్వరి దగ్గరా తీసుకోరాదు.